Shivaji: సినిమాల్లోకి రాకముందు శివాజీ ఏం చేసేవారో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోగా వరుస సినిమాలలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న శివాజీ.. ఆ తర్వాత కమెడియన్ పాత్రలు చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకున్నారు.ఇక ఇటీవల సినిమాలలో అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సమయంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశం రాగా హౌస్ లోకి అడుగుపెట్టి మరొకసారి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్న శివాజీ టాప్ త్రీ కంటస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఎన్నో విషయాలను వెల్లడిస్తున్న ఆయన ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారో కూడా వెల్లడించారు.

ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ..తాను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ముందు ఎడిటింగ్ రూమ్లో పనిచేశానని తెలిపారు. కేఎస్ రామారావు స్టూడియో పెట్టిన తర్వాత ఆయన వద్దకు వెళ్లి ఎడిటర్ గా పనిచేశాను. అప్పట్లో కేసు రామారావును కలవాలి అంటే ఏదైనా ఆయనకు ఒక పెద్ద కథ చెప్పాలి.. అది చెబితేనే ఆయనను కలిసే అవకాశం ఉంటుంది.. లేకపోతే అపాయింట్మెంట్ ఇవ్వరు.. ఈ విషయాన్ని నాకు ఒక డైరెక్టర్ చెప్పడంతో నేను కూడా ఆయనకి ఒక కథ చెప్పాలి అని తన అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇక అలా కేఎస్ రామారావు అపాయింట్మెంట్ దొరకగానే ఆయన వద్దకు వెళ్తే.. ఏం కథ ? అని అడిగారు. దాంతో నేను.. క్షమించండి అబద్ధం చెప్పి వచ్చాను.. నాకు కథలు చెప్పడం రాదు..ఎడిటింగ్ మాత్రమే వచ్చు.. ఎడిటర్ గా పనిచేస్తాను అంటూ అసలు విషయం చెప్పాను. దాంతో భలే వాడివయ్యా నువ్వు అని అన్నారు.

ఇక ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత జీతం ఎంత కావాలి? అని అడిగారు. మూడు పూటలా అన్నం పెట్టి.. కాస్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వండి సార్ అని అడిగాను.. వెంటనే క్యాషియర్ ని పిలిపించి నాకు రూ.800 ఇచ్చారు. ఇక అదే నా మొదటి రెమ్యూనరేషన్ అంటూ తెలిపారు శివాజీ. అలా ఇండస్ట్రీ లోకి రాకముందు ఎడిటింగ్ విభాగంలో పనిచేసిన ఈయన ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నారు.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు