Archana Kalpathi: టైటిల్ అది కాదు అని తేల్చి చెప్పేసిన నిర్మాత

రాజ్ కుమార్ హీరాని దర్శకత్వంలో వచ్చిన త్రీ ఇడియట్స్ సినిమాకి రీమేక్ గా స్నేహితుడు సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు శంకర్. దర్శకుడు శంకర్ మొదటిసారి రీమేక్ చేసిన సినిమా త్రీ ఇడియట్స్. ఈ సినిమాలో తలపతి విజయ్ మెయిన్ లీడ్ గా కనిపించాడు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులు కూడా తలపతి విజయ్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత విజయ్ చేసిన తుపాకీ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. విజయ్ చేసిన మాస్టర్, బీస్ట్,లియో సినిమాలు కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఇకపోతే తెలుగు దర్శకుడైన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన వారసుడు సినిమా కూడా కొంత మేరకు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే ప్రస్తుతం విజయ్ వెంకట ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. తలపతి 68పేరుతో ఈ సినిమా ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఈ సినిమాకి “పజిల్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు ఇదివరకే సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా టైటిల్ కరెక్ట్ కాదు అని నిర్మాత అర్చన కల్పాతి ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. దర్శకుడు వెంకట ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎన్నో హిట్స్ సినిమాలకు వెంకట ప్రభు ఇదివరకే దర్శకత్వం వహించాడు. చివరగా వెంకటప్రభు దర్శకత్వం వహించిన సినిమా “కస్టడీ” నాగచైతన్య హీరోగా చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేదు. ప్రస్తుతం తలపతి విజయ్ వెంకట ప్రభు దర్శకత్వంలో వస్తున్న సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది.

- Advertisement -

ఈ సినిమా టైటిల్ డిసెంబరు 31, 2023న విడుదలయ్యే అవకాశం ఉంది. రెండవ పోస్టర్ జనవరి 1, 2024న విడుదల చేయబడుతుంది. ఈ సినిమాలో మైక్ మోహన్, జయరామ్, స్నేహ, లైలా, యోగిబాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి, అజయ్ రాజ్ మరియు అరవింద్ ఆకాష్ వంటి ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు. AGS ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు