Salaar: మోహన్ లాల్ ను తక్కువ చేస్తున్న మలయాళ తమ్ముళ్లు… అంతా ప్రభాస్ వల్లే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “సలార్” విడుదలకు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 22న క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను మలయాళ తమ్ముళ్లు తక్కువ చేస్తున్నారు. దానికి కారణం ప్రభాస్ కావడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే…

ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. ప్రతి భాషలోనూ సూపర్ స్టార్స్ గా ఉన్న హీరోలు ఈ క్రిస్మస్ ను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీళ్ళందరికీ నైట్ మేర్ మారింది “సలార్”. అందరు హీరోలు కేవలం వాళ్ల భాషల్లోనే తమ సినిమాలను రిలీజ్ చేసుకుంటే, ప్రభాస్ సలార్ మాత్రం ఈ క్రిస్మస్ కు అన్ని భాషల బాక్స్ ఆఫీస్ లపై దండయాత్ర చేయడానికి రెడీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్లో ప్రభాస్, షారుక్ ఖాన్ మధ్య బిగ్ క్లాష్ నెలకొన్న విషయం తెలిసిందే.

తాజాగా మలయాళంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభాస్ ఈ క్రిస్మస్ కనుకగా  మలయాళం లో ఏకంగా అక్కడి సూపర్ స్టార్ మోహన్ లాల్ పై పోరుకు సిద్ధమవుతున్నాడు. మోహన్ లాల్ నటించిన “నేరు” అనే మూవీ డిసెంబర్ 21న అక్కడ థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్ 22న “సలార్” రిలీజ్ కాబోతోంది. ఈ ఇద్దరు బడా స్టార్ల మధ్య నెలకొన్న ఈ బాక్స్ ఆఫీస్ ఫైట్ లో మన డార్లింగ్ దే పైచేయి కనిపిస్తోంది. మలయాళ తమ్ములు సైతం తమ సూపర్ స్టార్ మోహన్ లాల్ మూవీ కంటే “సలార్” చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు.

- Advertisement -

ఇప్పటిదాకా బుక్ మైషోలో సలార్ మలయాళ వర్షన్ కు 1.5 మిలియన్ లైక్స్ రావడం విశేషం. అయితే ఒకరోజు ముందే రాబోతున్న మోహన్ లాల్ మూవీకి మాత్రం కేవలం 15k లైక్స్ నమోదు అయ్యాయి. అంతేకాకుండా అక్కడ ఇప్పటికే స్టార్ట్ అయిన “సలార్” అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మలయాళం లో ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఇప్పటిదాకా అక్కడ నమోదైన రికార్డులను బద్దలు కొడుతుందని డార్లింగ్ ఫాన్స్ భావిస్తున్నారు.

మరి మలయాళంలో “సలార్” మూవీకి ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి ప్రభాస్ ఒక కారణమైతే, మరో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ ఇంకో కారణం. పృథ్వీరాజ్ కి కూడా మలయాళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. “సలార్” మూవీలో ఇద్దరూ కలిసి నటిస్తుండడంతో అక్కడ ఈ సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఆ ఎఫెక్ట్ మోహన్ లాల్ సినిమాపై ఈ విధంగా పడింది. దీంతో “సలార్” సృష్టించబోయే సునామీలో మోహన్ లాల్ మూవీ కొట్టుకుపోవడం ఖాయం అనిపిస్తుంది. మరి డిసెంబర్ 22న “సలార్” మూవీ మలయాళం రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు