2023 Tollywood Controversies : తీవ్ర దుమారం రేపిన వివాదాలు… ఇంతమంది స్టార్స్ బలి

మరికొన్ని రోజుల్లో 2023 కంప్లీట్ కాబోతోంది. ఈ నేపథ్యంలో ఒకసారి 2023లో టాలీవుడ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనే విషయాలను నెమరు వేసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది పలు సూపర్ హిట్ సినిమాలతో పాటు, ప్రేక్షకులను నిరాశపరిచిన డిజాస్టర్ సినిమాలు కూడా వచ్చాయి. అంతేకాకుండా పలు ఊహించని కాంట్రవర్సీలో సౌత్ స్టార్స్ చిక్కుకోవడం ఇండస్ట్రీని షేక్ చేసింది. మరి 2023 లో ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపిన ఆ వివాదాలు ఏంటి? వివాదాలు చిక్కుకున్న సెలబ్రిటీలు ఎవరెవరు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ మెడకు చుట్టుకున్న “సంతోషం” అవార్డ్స్
ప్రెస్ మీట్లలో వివాదాస్పద ప్రశ్నలు అడుగుతూ వార్తల్లో నిలిచిన సినీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి “సంతోషం” అవార్డుల విషయంలో మరోసారి వివాదానికి కేంద్రంగా నిలిచారు. అవార్డులు ఇస్తామంటూ పిలిచి అవమానించారంటూ కొంతమంది కన్నడ స్టార్స్ కామెంట్స్ చేయడంతో సురేష్ కొండేటితో పాటు టాలీవుడ్ సైతం దుమ్మెత్తి పోశారు కన్నడ ఫాన్స్. అంతేకాకుండా అతను మెగా కాంపౌండ్ పిఏ అంటూ వార్తలు రావడంతో ఏకంగా నిర్మాత అల్లు అరవింద్ బయటకు వచ్చి అతనితో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ వివాదంతో టాలీవుడ్ కు అంతకన్నా సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

త్రిష – మన్సూర్ “రేప్” వివాదం
“లియో” సినిమాలో త్రిషను రేప్ చేసే సీన్ లేనందుకు బాధపడ్డాను అంటూ మలయాళ సీనియర్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మన్సూర్ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా మండిపడ్డారు. నడిగర్ సంగం సైతం మన్సూర్ పై నిషేధం విధించింది. అయితే టాలీవుడ్ నుంచి ఈ వివాదంలో త్రిషకు మద్దతుగా చిరంజీవి నిలిచారు. దీంతో మనసు చిరంజీవిని ఈ వివాదంలోకి లాగుతూ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా పరువు నష్టం దావా వేశాడు. అయితే చివరకు కోర్టు మన్సూర్ కే మొట్టికాయలు వేసింది.

- Advertisement -

మంచు ఫ్యామిలీలో వేగిన చిచ్చు
గత కొంతకాలంగా మంచు బ్రదర్స్ మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఈ ఏడాది బట్టబయలు అయ్యాయి. ఈ అన్నదమ్ములు ఇద్దరు దారుణంగా తిట్టుకున్న వీడియోలు సోషల్ మీడియా సర్కిల్స్ లో వైరల్ అయ్యాయి. మంచు విష్ణు ఏకంగా తన అన్న మంచు విష్ణు దౌర్జన్యం చేస్తున్నాడని, తనకు సంబంధించిన వారిపై దాడులు చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ తర్వాత మోహన్ బాబు కలగజేసుకోవడంతో ఈ వివాదం సైలెంట్ అయింది. కానీ ఇప్పటికీ ఈ అన్నదమ్ములు ఇద్దరి మధ్య వార్ నడుస్తూనే ఉంది. ఈ వివాదంపై స్పందించడానికి ఇద్దరూ కూడా రెడీగా లేరు.

“బ్రో”పై రాజకీయ రగడ
ఈ ఏడాది టాలీవుడ్ లో జరిగిన అతి పెద్ద వివాదాల్లో “బ్రో” సినిమా కూడా ఒకటి. వైసీపీ నేత అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ స్పూఫ్ వీడియోను, కొన్ని డైలాగులను ఈ సినిమాలో పెట్టారంటూ ఆయన తీవ్ర విమర్శలు చేయడంతో ఈ సినిమా వివాదాల్లో నిలిచింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి శ్యాంబాబు అనే పాత్రను “బ్రో” సినిమాలో పోషించారు. అయితే అతని ప్రవర్తన, నడక తీరు, డ్రెస్సింగ్ స్టైల్ అంబటిని పోలి ఉండడం ఈ వివాదానికి దారితీసింది.

అక్కినేని వర్సెస్ నందమూరి
ఏడాది జరిగిన ఒక ఈవెంట్ ల నందమూరి బాలకృష్ణ
తన తండ్రి ప్రస్తావన తీసుకొస్తూ నాన్నగారు అంటూ గౌరవంగా పిలిచి పొగడ్తల వర్షం కురిపించాడు. అక్కడిదాకా బాగానే ఉంది గాని తన తండ్రిని పొగిడే క్రమంలో అక్కినేని నాగేశ్వరరావును “అక్కినేని తొక్కినేని” అంటూ నోటికి వచ్చింది మాట్లాడి అందరిని అవాక్ అయ్యేలా చేశాడు బాలయ్య. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ధర్నాలు సైతం చేశారు. ఈ వివాదంపై అక్కినేని నాగచైతన్య స్వయంగా స్పందిస్తూ “ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వీఆర్ గారు ముగ్గురు తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనమే కించపరచుకోవడం” అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై సారీ చెప్పాల్సిన బాలయ్య తన తప్పును కవర్ చేసుకుంటూ ఎన్టీవోడు, నాగిగాడు అంటూ మరోసారి వివాదానికి తెర లేపారు.

విజయ్ దేవరకొండ వర్సెస్ అనసూయ
2022లో మొదలైన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అనసూయ మధ్య వివాదం 2023 లో కూడా అంతే ఎఫెక్ట్ గా కొనసాగింది. ఖుషి సినిమా పోస్టర్ పై ది దేవరకొండ అనే పదం ఉండడం పై అనసూయ ఇన్ డైరెక్ట్ గా పైత్యం ఎక్కువైంది, మనకు అంటకుండా జాగ్రత్త పడాలి అంటూ సెటైర్లు వేయడంతో అగ్నిలో ఆజ్యం పోసినట్టు అయింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మరోసారి ఆమెపై సోషల్ మీడియా వార్ ప్రకటించారు. నెల రోజులపాటు ఆగకుండా ఆమెను టార్గెట్ చేయడంతో అనసూయ సైలెంట్ గా సోషల్ మీడియా నుంచి తప్పుకుంది.

ఇక ఇది మాత్రమే కాకుండా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాపై ఏకంగా కోర్టుకి ఎక్కాడు సతీష్ అనే డిస్ట్రిబ్యూటర్. ఆ సినిమాను నిర్మించిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు తన దగ్గర 30 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ఇతను క్రిమినల్ కోర్టు ఎక్కాడు. ఇక ఆ వివాదం ఒక దశలో బోలాశంకర్ మెడకు కూడా చుట్టుకుంది.

“కేజిఎఫ్” మూవీలో హీరో పాత్రను నీచ్ కమీనే కుత్తే అంటూ కేరాఫ్ కంచరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ఆయన ఇన్ డైరెక్ట్ గా ప్రశాంత్ నీల్ పై విమర్శలు చేస్తూ తను విలువలకు కట్టుబడి సినిమాలు తీస్తానంటూ వెంకటేష్ కామెంట్స్ చేయడం ఎవరికీ నచ్చలేదు. దీంతో అతను సారి చెప్పక తప్పని పరిస్థితిని కల్పించారు అభిమానులు.

ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ ను పెంచుకున్న వెంకటేష్ “రానా నాయుడు” అంటూ ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యేలా బూతులు మాట్లాడి విమర్శల పాలయ్యారు. ఆ విమర్శల ధాటికి రానా నాయుడు తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ ను సైతం ఆపేశారు.

కేవలం ఇవి మాత్రమే కాదు టాలీవుడ్ ను ఊపు ఊపేసిన వివాదాల్లో యాంకర్ సుమ వివాదం కూడా ఒకటి. తన కొడుకు సినిమా ఈవెంట్లో మీడియా జనాలు బ్రేక్ ఫాస్ట్ ను భోజనంలో చేసేస్తున్నారంటూ సుమ కామెడీగా చేసిన కామెంట్స్ సీరియస్ గా తీసుకున్నారు జర్నలిస్టులు. దీంతో సుమ తాను కావాలని అలా కామెంట్స్ చేయలేదని, తన వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అంటూ ఆ వివాదానికి పుల్ స్టాప్ పెట్టింది.

తిరగబడరా సామి” మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్ మనవరాలు చోప్రాను డైరెక్టర్ ఏ ఎస్ రవికుమార్ బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. దీంతో ఆ డైరెక్టర్ ఆమెను ముద్దు పెట్టుకోవడంలో తప్పేముంది? అంటూ దానిని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఆప్యాయతతోనే ఆ అమ్మాయిని అలా ముద్దు పెట్టుకున్నా… నా కుమార్తెను కూడా అలాగే ముద్దు పెట్టుకుంటా. ఆ హీరోయిన్ కు, నా కుటుంబానికి లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకు? అంటూ ఎదురు ప్రశ్నించాడు. ఇక హీరోయిన్ కూడా ఈ విషయాన్ని లైట్ తీసుకోవడంతో ఆ వివాదం కాస్త అక్కడితో సద్దుమణిగింది.

ఏడాది చిన్న సినిమాగా విడుదలై సంచలనం సృష్టించిన మూవీలో “బేబీ” ఒకటి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది. రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ అందులో మిడిల్ ఫింగర్ పై హీరోయిన్ ఉన్నట్టుగా పోస్టర్ ను రిలీజ్ చేయడం వివాదానికి దారితీసింది. అంతేకాకుండా రిచ్ కిడ్స్ మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు ? అంత దారుణంగా ఉంటారు అను చూపించడంతో దర్శకుడుపై విమర్శలు వెల్లువెత్తాయి. బేబీ డైరెక్టర్ ఈ విషయంలో తన తప్పును ఒప్పుకోవడంతో అధి కాస్త సద్దుమణిగింది.

ఇక ఈ ఏడాది జరిగిన వివాదాల్లో యంగ్ హీరో నిఖిల్ “స్పై” మూవీ కాంట్రవర్సీ కూడా ఒకటి. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో హీరో నిఖిల్ కు, ఆ మూవీ నిర్మాతకు మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే 2023లో చాలా వివాదాలే నడిచాయి.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు