Sadha: ఆ తప్పే సదా జీవితాన్ని నాశనం చేసిందా..?

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు ఎక్కువ కాలం కొనసాగలేరు అనడంలో సందేహం లేదు. అయితే కొంతమంది మాత్రమే తమ స్టార్ డం కొనసాగిస్తూ దశాబ్దాలు తరబడి హీరోయిన్స్ స్థాయిలో కొనసాగుతూ ఉంటారు. కానీ మరికొంతమంది తాము చేసే తప్పిదాల వల్ల అర్ధాంతరంగా సినీ కెరియర్ను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో హీరోయిన్ సదా కూడా ఒకరు. హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ వచ్చినప్పటికీ కూడా.. తన తదుపరి సినిమాల విషయంలో తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల ఇండస్ట్రీలో కొనసాగ లేక పోయింది. సినిమా ఇండస్ట్రీలో తన అందం నటనతో ఎంతో మంచి టాలెంట్ కలిగి ఉన్న ఈమె అర్ధాంతరంగా సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ఇలా ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం కూడా లేకపోలేదు. ఇకపోతే నితిన్ హీరోగా నటించిన జయం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయం అయింది.

మొదటి సినిమాతోనే తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సదా అనంతరం తెలుగు , తమిళ భాష చిత్రాలలో నటించింది. అంతేకాదు పలు సినిమాలకు అవార్డులు కూడా అందుకుంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె.. అవకాశాలను ఎందుకు కోల్పోయారు అనే విషయానికి వస్తే కెరియర్.. వరంగా ఈమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆమెను ఇండస్ట్రీకి దూరం చేశాయి. సాధారణంగా హీరోయిన్లు తమ బాడీకి అనుగుణంగా ఉండే క్యారెక్టర్ లను ఎంపిక చేసుకొని అదేవిధంగా సినిమాలలో నటిస్తే ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు అందుకుంటారు.. అలా కొనసాగినప్పుడే ఎక్కువ కాలం పాటు మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. కానీ సదా మాత్రం అలా కాకుండా విభిన్నమైన కథ చిత్రాలలో తనకు ఏమాత్రం సూట్ కాని సినిమాలలో నటించింది. ఈ కారణంగానే ఆమె సినిమా అవకాశాలను కోల్పోయింది అని చెప్పవచ్చు.

ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా అప్పుడప్పుడు బుల్లితెర షోలలో సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఢీ వంటి డాన్స్ షోకి జడ్జిగా వ్యవహరించింది.. ఇకపోతే ఇప్పటికైనా తెలుసుకొని సరైన పాత్రలు ఎంచుకొని మళ్ళీ సినిమాలలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

- Advertisement -

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు