Hrithik roshan : క్రిష్4 కి లైన్ క్లియర్

హృతిక్ రోషన్ హీరోగా, రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన క్రిష్ మూవీ ఫ్రాంచైజ్ ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోయి మిల్ గయా సినిమా సీక్వెల్ గా 2006లో వచ్చిన క్రిష్ సినిమా ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ లో సూపర్ హీరోల సినిమాలు చూడటమే కానీ ఇండియాలో సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమాలేవీ పెద్దగా రాలేదు. అయితే ఈ లోటు క్రిష్ సినిమాతో తీరిపోయింది. క్రిష్ సినిమా తరువాత సూపర్ హీరో కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు వచ్చిన క్రిష్ అంత పాపులర్ ఐతే కాలేదనే చెప్పాలి.

కోయి మిల్ గయా సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమా దర్శకుడు రాకేష్ రోషన్ సినిమాకి సీక్వెల్ తొందరలోనే వస్తుందని ఎనౌన్స్ చేసాడు. ఆ తరువాత 3 సంవత్సరాల గ్యాప్ తరువాత క్రిష్ సినిమా వచ్చింది. అయితే కోయి మిల్ గయా సినిమాలో ప్రీతి జింటా క్యారెక్టర్ ని క్రిష్ లో ప్రియాంక చోప్రా రీప్లేస్ చేసింది. క్రిష్ సినిమా కూడా సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ గా రాకేష్ రోషన్ 2013లో క్రిష్ 3 సినిమా కూడా తీశారు. ఈ సినిమా దాదాపు 400 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ప్రస్తుతం దర్శకుడు రాకేష్ రోషన్ క్రిష్4 ని ప్లాన్ చేస్తున్నరంట.గతంలో క్రిష్3 సినిమాని 3డి లో ప్లాన్ చేసి యూనివర్సల్ రీచ్ తీసుకొద్దామనుకున్న రాకేష్ రోషన్ అప్పటి పరిస్థితుల వల్ల క్రిష్ ని 2డి లోనే రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమాకి యూనివర్సల్ రీచ్ రావడంతో క్రిష్ 4 ని గ్రాండ్ స్కేల్ లో ప్లాన్ చేయబోతున్నరట, ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ సినిమా సీక్వెల్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లిట్ అయిన తరువాత క్రిష్4 పనులు మొదలవ్వనున్నాయని సమాచారం. అయితే ఈ సినిమాకి రాకేష్ రోషన్ ప్రొడక్షన్ బాధ్యతలు మాత్రమే చూసుకుంటారట, హృతిక్ రోషన్ తో అగ్నీపత్ సినిమా తీసిన కరణ్ మల్హోత్రా ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు