Box office: రామబాణం ఫస్ట్ డే కలెక్షన్స్.. ఇలా అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయలేదు

గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రామబాణం. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మే5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదయింది. అయితే తొలి షో నుంచే ఈ సినిమా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ఫస్ట్ షోకే ప్లాప్ టాక్ రావడంతో ఆ టాక్ అన్ని చోట్ల స్ప్రెడ్ అయ్యి సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపింది. మాములుగా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినపుడు టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ డే ఓపెనింగ్స్ మాత్రం బాగా వస్తాయి. ఈ మూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ మూవీ ఓపెనింగ్స్ పై తీవ్రంగా ప్రభావం చూపించాయి.

రామబాణం వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లను ఒక్కసారి గమనిస్తే నైజాం : 46L, సీడెడ్ : 21L, ఉత్తరాంధ్ర : 14L, ఈస్ట్ : 9L, వెస్ట్ : 6L, గుంటూరు: 8L, కృష్ణ : 8L, నెల్లూరు : 5L, ఓవరాల్ గా ఏపి, తెలంగాణ లో కలిపి 1.17 కోట్ల షేర్ ని 2.20 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా కర్ణాటక, ఓవర్సీస్ తో కూడా కలిపి మరో 1.27 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టగా, 2.45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

రామబాణం సినిమాకి 14.50 కోట్ల బిజినెస్ జరగగా 15 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయి ఫస్ట్ డే కేవలం 1.27 కోట్లు వసూలు చేయడం దారుణమని చెప్పాలి. అసలు గోపీచంద్ స్థాయికి, ఈ సినిమా పై ఉన్న బజ్ కి కనీసం 4 కోట్లయినా ఫస్ట్ డే వసూలు చేయాల్సింది. గోపీచంద్ కెరీర్లో చాణక్య తరువాత అంతటి దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ సినిమా. ఇక రామబాణం సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 13.80 కోట్లయినా వసూలు చేయాలి. మరి వీకెండ్ ముగిసే సరికి ఎలాంటి కలెక్షన్స్ వస్తాయో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు