Koratala shiva : ఎన్టీఆర్30 టీజర్ ఎప్పుడో తెలుసా ?

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా తొందర్లోనే మూడో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు.

జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ వస్తోన్న సినిమా అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎన్టీఆర్ పక్కన బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ నెల20న ఎన్టీఆర్ పుట్టిన రోజు వస్తుండటంతో సినిమాకి సంబంధించి టీజర్ ని రిలీజ్ చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు .

అయితే RRR సినిమా తరువాత ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్నేషన్ అప్పీల్ ఉండేలా టీజర్ కట్ చేస్తున్నరంట. RRR తరహాలో ఎన్టీఆర్ 30 కి కూడా అన్ని భాషలకి అర్థం అయ్యేలా ఒకే టైటిల్ పెట్టడానికి చూస్తున్నారని టాక్. మరో పక్క రామ్ చరణ్ శంకర్ కాంబినేషలో వస్తోన్న సినిమా టైటిల్ చరణ్ బర్త్ డే రోజున రిలీజ్ చేసారు. శంకర్ కూడా చరణ్ స్టార్డం ని దృష్టిలో పెట్టుకొని గేమ్ చెంజర్ అనే టైటిల్ ని ఖరారు చేసారు. అయితే ఎన్టీఆర్ సినిమా టైటిల్ కూడా చరణ్ సినిమా టైటిల్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా కొరటాల జాగ్రత్త పడుతున్నరంట. గతంలో సినిమా ఎనౌన్స్ చేసిన గ్లిమ్స్ వీడియో లో ఉన్న “వస్తున్న” అనే వర్డ్ ని మొదటగా టైటిల్ పెడదాం అనుకున్నరంట..కానీ ఇప్పుడుఅది కాకుండా పవర్ ఫుల్ గా ఉండే టైటిల్ కోసం చూస్తున్నరని సమాచారం.

- Advertisement -

అయితే వచ్చే వారం ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేస్తారంట. ఆ తరువాత ఎన్టీఆర్ బర్త్ డే ముందు రోజు టైటిల్ తో పాటు టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నరంట. టీజర్ లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కి సంబంధించి యాక్షన్ పోర్షన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నారంట. కొరటాల గత చిత్రం ఆచార్య హ్యూజ్ డిజాస్టర్ అవడంతో కొరటాల ఈ సినిమా విషయంలో చాలా పర్టిక్యూలర్ గా ఉంటున్నాడని సమాచారం. 2024లో రిలీజ్ అయ్యే ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు