Boxoffice: ఉగ్రం మూవీ డే1 కలెక్షన్స్.. డీసెంట్ స్టార్ట్

అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూపొందగా ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన నాంది సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు నరేష్, విజయ్ కలయికలో వచ్చిన రెండో చిత్రమిది. మే5 న వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే దీనితోపాటే అదే రోజు విడుదలైన రామబాణం చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడంతో ఉగ్రం సినిమా ఓపెనింగ్స్ కు కొంత హెల్ప్ అయింది.

తాజాగా ఉగ్రం మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు వచ్చాయి. ఆ కలెక్షన్ల వివరాలు ఏరియా వైస్ గా ఇలా ఉన్నాయి. నైజాం: 23L, సీడెడ్: 10L, ఉత్తరాంధ్ర: 7L, ఈస్ట్: 5L, వెస్ట్: 3L, గుంటూరు: 5L, కృష్ణ: 5L, నెల్లూరు : 3L టోటల్ గా ఏపీ, తెలంగాణలో కలిపి 0.61కోట్ల షేర్, 1.15 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్ ప్రాంతాలు కలిపి మరో 12 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ఉగ్రం సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 0.73 కోట్ల షేర్ ని, 1.45 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

ఉగ్రం మూవీ వరల్డ్ వైడ్ గా 5.80 కోట్ల బిజినెస్ చేయగా 6.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా, ఫస్ట్ డే 73 లక్షల షేర్ వచ్చింది. అయితే ఉగ్రం సినిమా కి జరిగిన బిజినెస్ దృష్ట్యా వచ్చిన ఫస్ట్ ఓపెనింగ్స్ సరిపోవని చెప్పాలి. కానీ దీనికి పోటీగా విడుదలైన సినిమా డిజాస్టర్ అవడం వల్ల బిజినెస్ కూడా తక్కువ అవడం వల్ల వీకెండ్ లో మంచి జోరు చూపిస్తే బ్రేక్ ఈవెన్ కాకపోయినా టార్గెట్ దగ్గరి దాకా రావచ్చు. మరి వీకెండ్ పూర్తయ్యేసరికి ఎలా ఆడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు