Tollywood : అల్లు అరవింద్ వల్ల ఉదయ్ కిరణ్ మిస్ అయిన సూపర్ హిట్ మూవీ ఏదో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగి ఓ వెలుగు వెలిగిన హీరో ఉదయ్ కిరణ్. మరీ ముఖ్యంగా యూత్ గుండెల్లో నిలిచిపోయిన స్టార్. ఒకానొక సమయంలో లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషనల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు ఉదయ్ కిరణ్. అతికొద్ది కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. అయితే ఇప్పటికీ ఆయన మరణానికి సంబంధించి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతుంటారు. కానీ వాస్తవం ఏంటన్నది మాత్రం ఉదయ్ కిరణ్ కి మాత్రమే తెలుసు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు మురళీమోహన్ ఉదయ్ కిరణ్ ని మొదట హీరోగా చేయాలని భావించారట. ఆ విషయాన్ని ఉదయ్ కిరణ్ తోప్రస్తావించగా.. అతడు సినిమా చేయడానికి సిద్ధమని తనకి మాట ఇచ్చారట. కానీ ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత తో ఉదయ్ కిరణ్ కి వివాహం నిశ్చయమైంది. దీంతో ఉదయ్ కిరణ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను అల్లు అరవింద్ దగ్గర ఉండి చూసుకున్నారట. చివరికి ఉదయ్ కిరణ్ డేట్స్ కి సంబంధించిన డైరీ ని కూడా అరవింద్ దగ్గరే పెట్టుకోవడంతో అతను ఏ సినిమా చేయాలి, ఎవరితో సినిమా చేయాలనే వాటిని కూడా అరవింద్ పర్యవేక్షణలోనే జరిగేవని మురళీమోహన్ తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ అంతకుముందే ఈ సినిమా ఒప్పుకోవడంతో డేట్స్ అడగగా ఖాళీ లేవని అరవింద్ చెప్పారట. దీంతో ఆ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కి వెళ్లిందని.. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని తెలిపారు మురళీమోహన్. ఆ సినిమా కనుక ఉదయ్ కిరణ్ చేసి ఉంటే అతని కెరీర్ మరో రేంజ్ కి వెళ్ళలేదని అన్నారు.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు