Boxoffice: విరూపాక్ష డే1హిందీ,15డేస్ తెలుగు కలెక్షన్స్.. ఎక్కడ తగ్గట్లేదుగా

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష బాక్స్ ఆఫీస్ వద్ద తన పరుగును కంటిన్యూ చేస్తుంది. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకొని కేవలం 4రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కొత్త సినిమాలు పోటీగా రిలీజ్ అయినా, ఆ చిత్రాలు ప్లాప్ టాక్ తెచ్చుకోవడం తో విరుపాక్షకు అడ్డే లేకుండా పోయింది. ఇప్పటివరకు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 41 కోట్లకి పైగా షేర్ సాధించిగా, ఇక నుండి ఈ కలెక్షన్లను మరింత పెంచుకుంటుంది.

తాజాగా ఈ సినిమా ఇతర భాషల్లో కూడా మే5న థియేటర్లలో విడుదలయింది. నిజానికి ఏప్రిల్21నే పాన్ ఇండియా సినిమాగా విరూపాక్ష విడుదల కావాల్సి ఉన్నా, అప్పటి పోటీ దృష్ట్యా ఆ ఆలోచనని విరమించుకున్నారు. ఇప్పుడు విరూపాక్ష బ్లాక్ బస్టర్ కావడం తో అన్ని చోట్ల రిలీజ్ చేశారు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విరూపాక్ష విడుదల కాగా, అక్కడ కూడా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది.

ఇక విరూపాక్ష 15వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాలు విడుదలైనా ఆ పోటీని తట్టుకొని విరూపాక్ష బెస్ట్ కలెక్షన్లు వసూలు చేసింది. ఏపీ, తెలంగాణాలో కలిపి ఈ మూవీ 41లక్షల షేర్ ని, 70 లక్షల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక విరూపాక్ష హిందీ, ఇతర భాషల్లో కలిపి మొదటిరోజు 30లక్షల షేర్ ని వసూలు చేయగా 60 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్ గా 15 వ రోజు ఇతర భాషలతో కలిపి విరూపాక్ష 80లక్షల షేర్ ని 1.80కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇక హిందీ కలెక్షన్ల తో కలిపి ఇప్పుడు 100 కోట్ల మార్క్ ని విరూపాక్ష ఈజీ గా అందుకునే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు