Samantha: చై-సామ్ మళ్ళీ కలవబోతున్నారు… ఇదిగో సాక్ష్యం !

సమంత, నాగ చైతన్యలు టాలీవుడ్ లోనే మోస్ట్ లవరబుల్ కపుల్ లా ఉండేవాళ్ళు. ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వీళ్ల ప్రేమ 2017 అక్టోబర్ 6న పెళ్లితో ఒక్కటైయ్యారు. సాధారణంగా హీరోలకి పెళ్లి అయితే వాళ్ళ భార్యలు సినిమాలు చేయడానికి ఒప్పుకోరు. నాగార్జున కూడా అమలతో పెళ్లి అయ్యాక అమల సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు. మహేష్ బాబు కూడా నమ్రతతో పెళ్లి అయ్యాక నమ్రతని సినిమాలు చేయనివ్వలేదు. కానీ చైతన్య మాత్రం అందరి భర్తల్లాగా ఉండకుండా సమంతకి చాలా ఫ్రీడమ్ ఇచ్చాడు.

సమంత ఇష్టాలకి చై ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. పెళ్లి తరువాత కూడా సమంత సినిమాలు చేయడానికి నో చెప్పలేదు. కానీ సమంత సినిమాలు చేస్తున్న సమయంలో తనపై రూమర్స్ వస్తుండంతో సామ్ ని చై రెస్టిక్ట్ చేసాడు. దాంతో వీళ్లిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇలా కొన్నాళ్లపాటు సాగింది. ఆ తరువాత ఇద్దరు ఏకాభిప్రాయంతో 2021లో అక్టోబర్ 2న ఆఫీషయల్ గా విడాకులు తీసుకున్నారు.

ఐతే అనోన్యంగా కలిసి ఉండే చై, సామ్ లు ఎందుకు విడిపోయారో ఎవరికీ అర్థం కాలేదు. విడాకుల తరువాత వారి, వారి లైఫ్ వాళ్ళు చూసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. కానీ చై సినిమా రిలీజైన, సమంత సినిమా రిలీజైన ప్రమోషన్స్ లో మీడియా తో మాట్లాడవలసిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం కామన్ గా అందరు వీళ్లిద్దరి పర్సనల్ లైఫ్ గురించి అడగటం అలవాటుగా మారింది. కానీ సమంత గాని, చై గాని ఒకరికొకరు ఎప్పుడు కంప్లైంట్ చేసుకోలేదు.

- Advertisement -

అయితే వీళ్లిద్దరు విడిపోయి దాదాపు రెండేళ్ల తర్వాత డైవర్స్ కు కారణం ఏంటో నాగ చైతన్య బయటపెట్టాడు. లేటెస్ట్ గా నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఆయన, సమంతతో తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో కెమెరా ఎదురుగా బయటపెట్టారు. “సమంత నేను విడిపోవడానికి కారణం, మా మధ్య గొడవలకి కారణం సోషల్ మీడియానే. రోజు ఏదో ఒక న్యూస్ మా ఇద్దరి పర్సనల్ లైఫ్ గురించి ట్రెండ్ అవుతూనే ఉండేది. దాని వల్లనే మా ఇద్దరి గొడవలు వచ్చేవి అంతే తప్ప సమంతపై నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. తాను చాలా మంచిది ” అంటూ నాగ చైతన్య తన మనసులో మాట బయటపెట్టాడు.

అయితే సమంత ఈ కామెంట్ పై స్పందిస్తూ.. తన ఇంస్టాగ్రామ్ లో చై మాటలకి రిప్లై గా “మనమంతా ఒక్కటే. ఇగో, నమ్మకాలు మరియు భయాలు మాత్రమే మనల్ని వేరు చేస్తాయి” అంటూ ఒక కొటేషన్ స్టోరీగా పెట్టుకుంది. దీన్ని బట్టి చూస్తే నాగ చైతన్యకి, సమంతకి మళ్ళీ ఒక్కటవ్వాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయంపై చై ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు