Custody: నాగచైతన్య ని ఆ డైరెక్టర్ అంతగా హర్ట్ చేశాడా..?

మొదలైన సినిమాలన్నీ పూర్తయ్యి విడుదల అవుతాయన్న గ్యారంటీ లేదు. కొన్ని స్క్రిప్ట్ దశలోనే ఆగిపోతే, మరికొన్ని సెట్స్ మీదకి వెళ్ళాక వివిధ కారణాల చేత వాయిదా పడుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని ఆర్థిక ఇబ్బందుల వల్ల విడుదలకి నోచుకోక అటకెక్కుతుంటాయి. సినిమా ఆగిపోవటానికి కారణం ఏదైనా కావచ్చు కానీ, ఆ ప్రభావం ఎక్కువగా పడేది మాత్రం హీరోల మీదనే. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, నాగచైతన్య హీరోగా ఆగిపోయిన ఒక సినిమా తనపై ఎంత ప్రభావం చూపిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు హీరోగా యాక్షన్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన కస్టడీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతు సదరు సినిమా డైరెక్టర్ పై ఘాటైన కామెంట్స్ చేశాడు.

అప్పట్లో డైరెక్టర్ పరశురామ్ పేట్ల, నాగచైతన్య కాంబినేషన్లో ఓ సినిమా మొదలవ్వాల్సి ఉండగా స్క్రిప్ట్ వర్క్ చాలా కాలం జరిగాక డైరెక్టర్ మరో ప్రాజెక్ట్ కి వెళ్ళటం వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇంటర్వ్యూలో యాంకర్ పరశురామ్ గురించి అడుగగా సమాధానం ఇచ్చిన చైతు ఆయన గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అని, తనని బాగా హర్ట్ చేశాడని అన్నారు. సాధారణంగా మృదు స్వభావి అయిన చైతు ఇదివరకు ఎవరిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అలాంటిది ఒక డైరెక్టర్ గురించి ఏ రేంజ్ లో రెస్పాండ్ అయ్యాడంటే పరశురామ్ చైతుని ఎంతగా హర్ట్ చేశాడో ఊహించవచ్చు.

పరశురామ్ సినిమాలు మధ్యలోనే వదిలేయటం ఇది కొత్త కాదు, గతంలో 5, 6 ప్రొడక్షన్ హౌస్ ల నుండి అడ్వాన్సులు తీసుకొని సినిమాలు పూర్తి చేయలేదు. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న చైతు పరశురామ్ సినిమా కోసం చాలా సమయం వెచ్చించడం, పరశురామ్ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ వైపు చూడకపోవటం చైతుని అసహనానికి గురి చేసి ఉండటం వాస్తవమే అనిపిస్తోంది. ఈ క్రమంలో మే 21న విడుదలవుతున్న కస్టడీ సినిమాపై నాగచైతన్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరి, కస్టడీ ద్వారా అయినా హిట్ అందుకొని అక్కినేని వారి డిజాస్టర్స్ పరంపరకు చైతు బ్రేక్ వేస్తాడా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు