Tollywood: మళ్ళీ టాలెంట్ చూపించిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అన్ని రకాల జోనర్స్ లో సినిమాలు చేసిన హీరో ఆయన. హీరోగా ఈ తరం హీరోలకు కూడా పోటీనిస్తూ జోరు మీదున్నాడు బాలయ్య. లేటెస్ట్ గా సంక్రాంతికి వీరసింహారెడ్డి గా వచ్చి మరో విజయం సొంతం చేసుకున్న బాలకృష్ణ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. 2023 దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

ఇక బాలకృష్ణ ప్రస్తుతం షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చి తన తండ్రయిన నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకల్లో పాల్గొంటున్నాడు. ఈ మధ్యే వైజాగ్ లో ఏప్రిల్28 న జరిగిన ఎన్టీఆర్ 100ఇయర్స్ వేడుకలో సందడి చేసిన బాలయ్య, తాజాగా మరో ఈవెంట్ లో పాల్గొన్నాడు. మరోచోట ఎన్టీఆర్ 100ఇయర్స్ సెలబ్రేషన్ జరుగగా అక్కడ బాలయ్య తన గాత్ర ప్రతిభని మరోసారి చూపించాడు. ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ(1960) చిత్రంలో “శివ శంకరి” పాటను ఈ వేడుకలో వేదికపైన ఆలపించారు. గుక్కతిప్పుకోకుండా బాలయ్య పాడిన ఈ పాటకి అక్కడి ఆడియన్స్, అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.

అయితే బాలయ్య ఇలా స్టేజి మీద పాడటం కొత్తేమి కాదు. ఇంతకు ముందు మేముసైతం ఈవెంట్ లో తాను నటించిన సినిమాల్లోని పాటలను సింగర్ గీతా మాధురితో కలిసి పాడటం జరిగింది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాలయ్య కాలక్షేపానికి పాటలు పడుతూ ఉంటారని మనకు తెలిసిందే. అయితే అవి కొన్నిసార్లు ట్రోల్ అవుతుంటాయి. బహుశా బాలకృష్ణ మున్ముందు సినిమాల్లో కూడా నేరుగా పాటలు పాడే అవకాశం కూడా ఉందేమో.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు