VD12: సీనియర్ హీరోయిన్‌లకు తలనొప్పిగా మారిన శ్రీలీల

యంగ్ హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తుంది. ఏ సినిమాలో చూసిన ఈ యంగ్ బ్యూటీనే కనిపిస్తుంది. ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీలీల.. డాక్టర్ అవ్వాల్సింది. కానీ, అలా హీరోయిన్ అయిపోయి తెలుగు ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ, విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక అయిన సంగతి విధితమే.

అప్పటి నుంచి శ్రీలీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, శ్రుతి హాసన్ లాంటి సీనియర్ హీరోయిన్లతో పాటు ఈ మధ్య కాలంలో ఫేమస్ అవుతున్న చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్నారు. అయినా, దర్శక నిర్మాతలు.. ఈ యంగ్ బ్యూటీనే ఎందుకు ఎంచుకుంటున్నారు ? అంటూ చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో అధికారికంగానే ఎనిమిది సినిమాలు ఉన్నాయి. ఇక శ్రీలీల టైం ఇస్తే, మరిన్నీ సినిమాలు కూడా ఈమె చేతిలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ క్రమంలో సీనియిర్ హీరోయిన్లకు శ్రీలీల తలనొప్పిగా మారిందట. నిన్న కాక మొన్న వచ్చిన శ్రీలీలకు ఇలా వరుసగా అవకాశాలు రావడం సీనియిర్ హీరోయిన్లకు మింగుడు పడటం లేదట. ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉంటున్నా, చాలా మంది హీరోలకు చాలా హిట్స్ ఇచ్చినా, ఇప్పుడు తమను గుర్తించడం లేదంటూ కొంత మంది సీనియిర్ హీరోయిన్లు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారట. అవును మరి.. శ్రీలీల డేట్స్ అడ్జెస్ట్ కాలేకపోతున్నా.. నిర్మాతలు వెయిట్ చేస్తామనే అంటున్నారు. కానీ, ఈ సీనియిర్ హీరోయిన్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

- Advertisement -

శ్రీలీలతో పాటు మరి కొందమంది యంగ్ హీరోయిన్స్ ఉన్నారు. వాళ్లకు కూడా సరైన అవకాశాలు రావడం లేదు. ఇలాగే కొద్ది రోజులు ఉంటే, తెలుగులో వచ్చే సినిమా అంటే.. హీరోయిన్ శ్రీలీలనే కదా.. అనే భావన వస్తుందేమో మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు