Telugu Actress: విరూపాక్షతో పాన్ ఇండియా స్టార్ గా సంయుక్త?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే, అందం ఒకటి ఉంటే సరిపోదు. కావాల్సినంత లక్ కూడా ఉండాలి. అలాంటి అదృష్టం మలయాళ బ్యూటీ సంయుక్తకు చాలానే ఉందని చెప్పొచ్చు. ఈ మలయాళ కుట్టి చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. ఇక తెలుగులో సంయుక్త చేసిన సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యేక పాత్ర చేసిన భీమ్లా నాయక్ తో పాటు హీరోయిన్ గా చేసిన బింబిసార, సార్ అలాగే తాజా గా వచ్చిన విరూపాక్ష ఇలా అన్ని కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

ఇందులో భీమ్లా నాయక్, సార్ వంద కోట్ల మార్క్ ను అందుకున్న సినిమాలే. అలాగే విరూపాక్ష కూడా వంద కోట్ల మార్క్ కు అతి దగ్గరలో ఉంది. ఇప్పటికే 85 కోట్ల వరకు వసూళ్లు చేసిన విరూపాక్ష, మరో 15 కోట్లు కలెక్ట్ చేస్తే వంద కోట్ల క్లబ్ లో చేరిపోతుంది. విరూపాక్ష తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 21న విడుదలైంది. ఇప్పుడు తాజాగా మలయాళం, తమిళ, హిందీ భాషల్లో కూడా థియేటర్ లలోకి తీసుకువచ్చారు. ఇది ఇప్పటికే సక్సెస్ బ్యాగ్రౌండ్ ఉన్న సంయుక్తకు చాలా వరకు కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు.

సంయుక్తకు ఇప్పటికే నార్త్ నుంచి అవకాశాలు వస్తున్నాయి. కానీ, తాను ప్రస్తుతం టాలీవుడ్ అండ్ సౌత్ పైనే ఫోకస్ పెట్టినట్టు చెప్పింది. కానీ, విరూపాక్ష కు ప్రస్తుతం అన్ని భాషల్లో పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా సంయుక్త యాక్టింగ్, క్లైమాక్ లో సంయుక్త భయపెట్టిన తీరుకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నుంచి సంయుక్తకు భారీ అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ప్రస్తుతం సౌత్ లో టాప్ ప్లేస్ లో ఉన్న సంయుక్త పాన్ ఇండియా స్టార్ కూడా అవుతుందని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు