Sai Pallavi – Ashika: సిస్టర్స్ పెళ్లి చేసే పని పెట్టుకున్న హీరోయిన్స్.. ఇదేం ట్రెండ్..?

Sai Pallavi – Ashika: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. హీరోయిన్లు పెళ్లీడుకి వచ్చినా.. తాము పెళ్లి చేసుకోకుండా.. తమ సిస్టర్స్ కి పెళ్లి చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న సాయి పల్లవి తన చెల్లి పెళ్లి చేసే బాధ్యత తీసుకోగా.. ఇప్పుడు ఆషికా రంగనాథ్ కూడా తన చెల్లి పెళ్లి చేసే బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సాయి పల్లవి.. మరొకవైపు ఆషికా రంగనాథ్ ఇద్దరూ కూడా ప్రొఫెషనల్ గా బిజీగా ఉన్నారు. అలాగే తమ సిస్టర్స్ ని పర్సనల్ లైఫ్ లో బిజీ చేసేందుకు సిద్ధమయ్యారు.

రీసెంట్గా సాయి పల్లవి తన చెల్లెలు పూజా కన్నన్ నిశ్చితార్థం వేడుకను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 21 ఆదివారం రోజు పూజా ఖన్నన్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. తాను ప్రేమించిన వ్యక్తిని కుటుంబ సభ్యుల సమక్షంలో పూజా వివాహం చేసుకోబోతోంది. త్వరలోనే పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలను పూజా కన్నన్ అలాగే సాయి పల్లవి ఇద్దరూ కూడా తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చారు.

ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా ఏకంగా తన సిస్టర్ ను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లిపోయారు. ఆషికా సిస్టర్ అనూష పెళ్లి వేడుక జనవరి 22న సోమవారం రోజు చాలా ఘనంగా జరిగింది. అయితే ఈ విషయం ఎక్కడ తెలియలేదు.. తాజాగా ఆషిక ఈ ఫోటోలను అభిమానులతో పంచుకోవడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. తన సిస్టర్ మ్యారేజ్ లో ఆషికా కూడా పెళ్లికూతురులా రెడీ అయ్యి చాలా అద్భుతంగా కనిపించారు. పింక్ కలర్ ఆఫ్ సారీ లో మెస్మరైజింగ్ లుక్ తో ఆకట్టుకున్నారామే..

- Advertisement -

Sai Pallavi - Ashika: Heroines are working to marry sisters.. is this a trend..?

Sai Pallavi - Ashika: Heroines are working to marry sisters.. is this a trend..?

Sai Pallavi - Ashika: Heroines are working to marry sisters.. is this a trend..?

ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన నెటిజెన్స్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైందా ఏంటి? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొకవైపు తాము పెళ్లి చేసుకోకపోయినా తమ సిస్టర్స్ కి జీవితాన్ని ప్రసాదిస్తున్నారు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . మరి ఈ విషయాలపై ఈ హీరోయిన్లు ఏ విధంగా క్లారిటీ ఇస్తారో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు