Sai Pallavi: ఘనంగా సాయి పల్లవి చెల్లి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్..!

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ ఇటీవలే తాను ప్రేమలో పడ్డానని.. తన ప్రియుడిని కూడా పరిచయం చేసింది.ఇక త్వరలోనే పెళ్లి ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యారు.. అయితే ఆమె ఊహించని విధంగా నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. జనవరి 21న పూజా కన్నన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తాజాగా ఇప్పుడు ఈ విషయాన్ని పూజా కన్నన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే పూజా కన్నన్ షేర్ చేసిన ఫోటోలలో ఇరువర్గాల కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు. ఇక చెల్లి ఎంగేజ్మెంట్ వేడుకలలో సాయి పల్లవి చాలా అందంగా మెరిసిపోతుంది. అంతేకాదు ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరి చూపు సాయి పల్లవి మీద పడుతోందని చెప్పవచ్చు. ఈ ఫోటోలను చూసిన అందరూ సాయి పల్లవి పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి సాయి పల్లవి తన చెల్లిలాగే సడన్ గా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తుందా? లేక తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకుంటుందా? అన్నది చూడాలి.

ఇకపోతే సాయి పల్లవి కుటుంబం ఎక్కువగా బయట కనిపించదు.. ఆమె తల్లి, తండ్రి ఇలా ఎవరు కూడా బయటికి రారు. ఇక సాయి పల్లవి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండదు. అయితే ఇలా మొదటిసారి సాయి పల్లవి ఫ్యామిలీ ఫోటోలు బయటకు రావడంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట ట్రెండ్గా మారాయి. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉందని.. తాను ఎంచుకున్న వైద్య వృత్తిని కొనసాగిస్తుంది అంటూ పుకార్లు వచ్చాయి.. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య సరసన తండేల్ మూవీలో సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ రామాయణంలో సీతగా కూడా నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు ఒక తమిళ్ ప్రాజెక్టులో కూడా భాగం అయింది సాయి పల్లవి.

- Advertisement -

Sai Pallavi: The engagement of Sai Pallavi's sister is grand.. Photos are viral..!

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు