Tollywood : అనుదీప్ – రవన్న సినిమాలో ఈ కన్నడ బ్యూటీ ఫిక్స్..!

మాస్ మహారాజ్ రవితేజ టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా ఇది రూమర్ అనే అనుకున్నా, ఇది నిజమేనని అనుదీప్ సన్నిహితుల ద్వారా తెలిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తుండగా, రవితేజ ఈగల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదలవుతుందని సమాచారం. తాజాగా అనుదీప్ రవితేజ మూవీ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. రవితేజ హీరోగా అనుదీప్ దర్శకత్వం వహించే ఈ సినిమా ఒక కామెడీ తో కూడా లవ్ స్టోరీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం.

పక్కా అనుదీప్ మార్క్ తో మాస్ మహారాజ్ రవితేజ ని కొత్త స్టైల్ లో డైరెక్టర్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రీసెంట్ గా సప్త సాగరాలు దాటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన నటి రుక్మిణి వసంత్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారని, ఇప్పటికే ఆ హీరోయిన్ కంఫర్మ్ అయిపోయిందని టాక్ నడుస్తుంది. ఇక జనవరి 26న మాస్ మహారాజ్ బర్త్ డే కానుకగా ఈ సినిమా యొక్క అఫిషియల్ అనౌన్స్ మెంట్ జరగనుందని, ఆ రోజే ఈ సినిమా యొక్క నటీనటుల వివరాలను కూడా మేకర్స్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.

అయితే ఇప్పటివరకు కన్నడ సినిమాలు మాత్రమే చేసిన ఈ హీరోయిన్ డబ్బింగ్ సినిమా సప్త సాగరాలు ద్వారా తెలుగు ఆడియన్స్ ని పలకరించినా ఆ సినిమా సక్సెస్ ఇవ్వలేదు. కానీ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ యే మాస్ మహారాజ్ రవితేజ వంటి స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇస్తుంది కాబట్టి ఈ సినిమా హిట్ అయితే ఈ కన్నడ సుందరికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం ఖాయమని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు పెర్ఫార్మెన్స్ ప్రిఫరెన్స్ రోల్స్ ఎక్కువగా చేసిన ఈ హీరోయిన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే గ్లామర్ రోల్స్ కూడా చేయాల్సి ఉంటుంది. మరి ఈ హీరోయిన్ పాత్ర అనుదీప్ సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు