Vijay : బ్రాండ్ న్యూ లగ్జరీ కారు కొన్న దళపతి… కాస్ట్ తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే!!

Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గ్యారేజ్ లో తాజాగా మరో కొత్త కాస్ట్లీ కార్ చేరింది. సూపర్ స్టార్ డంని సొంతం చేసుకున్న ఈ హీరో ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాడు. కానీ ఆయన ఎక్కువగా ఇష్టపడే వాటిలో లగ్జరీ కార్లు ముందుంటాయి. మరి విజయ్ కొన్న కొత్త కారు కాస్ట్ విలువ ఎంత అంటే?

దళపతి విజయ్ సాధారణంగా విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉంటూ, నిరాడంబరంగా బతకడానికి ఇష్టపడుతున్నట్టుగా కనిపిస్తారు. కానీ తనకు ఇష్టమైన కార్లను మాత్రం ధర ఎంతైనా చూడకుండా కొనేస్తూ ఉంటారు. ఇప్పటికే ఈ హీరో కార్ల షెడ్డులో అత్యంత కాస్ట్లీ కార్లు ఉన్నాయి. అందులో మినీ కూపర్ ఎస్, ఆడి A8, రోల్స్ రాయిస్ ఘోస్ట్ వంటి కాస్ట్లీ, లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ మరో కొత్త కారును కొన్నారట. భారతదేశంలో అరుదుగా కనిపించే ఎలక్ట్రిక్ మోడల్ BMW 17 xDrive 60 అనే కారు ఇప్పుడు విజయ్ కార్ల సేకరణలో చేరిపోయింది. ఇక ఈ అరుదైన కారు విలువ తెలిస్తే ఎవరికైనా సరే కళ్ళు తిరగాల్సిందే. ఈ లగ్జరీ కారు ధర అక్షరాల 2 కోట్ల నుంచి 2.3 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ నేషనల్ మీడియాలో మాత్రం విజయ్ కొత్త కారు కొనడం గురించి వార్తలు వస్తున్నాయి.

ఇక విజయ్ సినిమాలో విషయానికి వస్తే… గత ఏడాది ఈ హీరోకు బాగా కలిసి వచ్చింది. 2023 సంక్రాంతి కానుకగా “వారసుడు” అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నాడు విజయ్. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “లియో” హిట్ తో 2023కు హ్యాపీగా బైబై కూడా చెప్పేశాడు. ప్రస్తుతం విజయ్ “గోట్” అనే సినిమాను చేస్తున్నాడు. కోలీవుడ్లో మానాడు, మంకథా వంటి వినూత్నమైన చిత్రాలను రూపొందించిన డైరెక్టర్ వెంకట్ ప్రభు “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -

షార్ట్ గా “గోట్” అని పిలుస్తున్న ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, ప్రభుదేవా, యోగి బాబు, జయరాం వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ వివాదాస్పదం కాగా, ప్రస్తుతం గోట్ చిత్రీకరణ దశలో ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు