Animal OTT Release Date: ఓటీటీ రిలీజ్‌పై ఇంత ఇంట్రెస్ట్‌కి కారణం ఇదే..

Animal OTT Release Date: యానిమల్ మూవీ… తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చిన ఈ సినిమా భారతీయ సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. 915 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీకి వచ్చిన ప్రశంసలు అన్ని ఇన్నీ కాదు. అలాగే ఇదే రేంజ్ లో విమర్శలు కూడా వచ్చాయి. ఏది ఏమైనా యానిమల్ సినిమా ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ మూవీ. అయితే ఈ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా… ఇంకా ఓటీటీలోకి రాలేదు.

ఇటీవల దీని తర్వాత వచ్చిన సలార్ మూవీ ఓటీటీలోకి వచ్చింది. బుల్లితెరపై రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఓటీటీ లవర్స్ నుంచి ఓ డిమాండ్ వస్తుంది. అదే యానిమల్ మూవీ ఓటీటీ రిలీజ్. ట్విట్టర్ వంటి సోషల్ మీడియలో నెటిజన్లు… యానిమల్ మూవీ టీంను ట్యాగ్ చేస్తూ ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వండి అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

ఒక సినిమా థియేటర్ లో వస్తుంది అంటే ఇలాంటి రచ్చ మనం చూస్తుంటాం. కానీ, థియేటర్ లో చాలా రోజుల నుంచి ఆడుతున్న సినిమాకు ఓటీటీ రిలీజ్ కోసం ఇలాంటి రచ్చ జరగడం ఇదే తొలిసారి కావొచ్చు అంటూ సినీ క్రిటిక్స్ అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. యానిమల్ మూవీ థియేటర్ వర్షెన్ లో 3:21 గంటలు ఉంది. కానీ, ఓటీటీ వర్షెన్ లో యానిమల్ మూవీ డ్యూరేషన్ 3:50 గంటలు ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. దీంతో మిగితా 30 నిమిషాల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది? థియేటర్స్ లో మిస్ అయిన కంటెంట్ ఏంటి? సెన్సార్ బోర్డ్ ఎలాంటి కంటెంట్ ను కట్ చేసింది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే యానిమల్ మూవీ ఓటీటీపై రోజు రోజుకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు