Salaar 2: సలార్ 2 లో అఖిల్.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ భార్య..!

Salaar 2: బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన ఎన్నో చిత్రాలు ఫెయిల్యూర్ గా మిగిలాయి. కానీ గత ఏడాది విడుదలైన సలార్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మాస్, యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటించగా.. పృథ్విరాజ్ సుకుమారన్ ,జగపతిబాబు, శ్రియా రెడ్డి వంటి వారు కీలకమైన పాత్రలలో నటించారు. హోంబలే ఫిలింస్ వారు నిర్మించిన ఈ సినిమాని రెండు భాగాలుగా చిత్రబృందం తెరకెక్కించబోతున్నట్లు తెలియజేశారు. సలార్-1 సీజ్ ఫైర్ పేరిట ఈ సినిమాని విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.

సలార్ సినిమాకి సీక్వెల్ గా సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వం అన్నట్లుగా టైటిల్ ని తీసుకోబోతున్నట్లు వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే సక్సెస్ సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్ గా ఇటీవలే చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలకు ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ , పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొనింది.

అయితే ఈ వేడుకలలో అక్కినేని అఖిల్ కూడా పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో రెండవ భాగంలో అఖిల్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి.. అఖిల్ దేవా తమ్ముడుగా కనిపించబోతున్నారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. దీంతో తాజాగా ఈ సినిమా పైన ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేసింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి. ఈ సందర్భంగా పార్ట్ 2 గురించి ఇన్స్టాగ్రామ్ లో పలు రకాల విషయాలను తెలియజేసింది.

- Advertisement -

దేవా తండ్రి పాత్రను ఎవరు పోషిస్తున్నారంటూ ఒక నెటిజన్ అడగగా.. అందుకు లిఖిత శౌర్యాంగ పర్వంలో దారా పాత్రను చూసేందుకు చాలా వెయిట్ చేస్తున్నానంటూ తెలిపింది.మరొకరు తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా..? అని అడగగా .. ఇందుకు లిఖిత ఇది మిలియన్ డాలర్ల మంది ప్రశ్న అంటూ తెలిపింది.. సలార్-3 వ భాగానికి శౌర్యంగ పర్వం క్లైమాక్స్లో సమాధానం దొరుకుతుందంటూ తెలిపింది. అలాగే అఖిల్ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు అనే రూమర్స్ పైన కూడా లిఖిత చెబుతూ.. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ సమాధానాన్ని ఇచ్చింది.. అలాగే ప్రభాస్ కి ఈ సినిమాలో ఎందుకు డైలాగులు తక్కువగా ఉన్నాయని అడగగా.. అతని నీడే మిలియన్ డైలాగులకు సమానం అంటూ తెలిపింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు