Actor’s: ముదురు వయసులో తండ్రులైన స్టార్స్ వీళ్ళే..!

Actor’s: ప్రస్తుతం కాలంలో ప్రజల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి.. గతంలో 18 ఏళ్లు అవ్వగానే వివాహం చేసుకొని 22 ఏళ్లలోపు పిల్లల్ని కనేవారు.. కానీ ఇప్పుడు పూర్తిగా కాలం మారిపోయింది. నేటికి 50 నుంచి 80 ఏళ్ల మధ్యలో తల్లిదండ్రులవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు . అయితే మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మాత్రం 50 నుంచి 83 సంవత్సరాల మధ్య వయసున్న తల్లితండ్రులుగా మారుతున్న విషయం తెలిసిందే. మరి ముదురు వయసులో తల్లిదండ్రులుగా మారుతున్న సెలబ్రిటీల గురించి ఇప్పుడు చూద్దాం.

ఆలస్యంగా తల్లిదండ్రులైన వారిలో విలక్షణమైన నటుడుగా పేరుపొందిన ప్రకాష్ రాజ్ కూడా ఒకరు.. అతని మాజీ భార్య లలిత కుమారి తో ముగ్గురు పిల్లలు ఉన్నారు.. ఆ తర్వాత 50 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకొని.. ఆమె ద్వారా మరొకసారి తండ్రి అయ్యారు. ఈమె బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తుంది. వీరికి ఒక మగ బిడ్డ జన్మించారు.

నటుడుగా , డైరెక్టర్ గా, కొరియోగ్రాఫర్ గా మంచి పాపులారిటీ సంపాదించిన ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఈ విషయం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని.. పూర్తి సంతృప్తి చెందినట్లుగా పోస్ట్ షేర్ చేశారు.

- Advertisement -

బాలీవుడ్ నటుడు , ఒకప్పుడు హీరోగా మంచి పాపులారిటీ సంపాదించిన సంజయ్ దత్ తన 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడని తెలియజేశారు.. మాన్యత దత్ ని లేట్ గా వివాహం చేసుకున్న ఈ హీరో ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.. ఈ ఇద్దరు పిల్లలు అచ్చం సంజయ్ దత్ లాగానే ఉంటారట.

బ్యాట్ మాన్ రాబిన్ స్టార్ నటుడు జార్జ్ క్లూని 56ఏళ్ల వయసప్పుడు తండ్రి అయ్యారట.. 56 ఏళ్ల వయసులో భార్య అమలతో కవల పిల్లలకు జన్మనిచ్చారు.

రాజేష్ కట్టర్ లేట్ వయసులో తండ్రి అయ్యారు. తన భార్య వందన సంజానేతో 52 సంవత్సరాల వయసులో తనకు తండ్రి అయ్యే అదృష్టం లభించింది అని స్వయంగా తెలియజేశారు..

వీరే కాకుండా చాలామంది సెలబ్రిటీలు సైతం 50 ఏళ్ల పైబడిన తర్వాత వివాహం చేసుకొని తల్లితండ్రులవుతున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు