Guntur Kaaram: ఈశ్వరి రావు పాత్రని మిస్ చేసుకున్న నటి ఎవరో తెలుసా?

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ముచ్చటగా వచ్చిన మూడవ చిత్రం “గుంటూరు కారం”. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం హాట్ యాంకర్ ని హీరోయిన్ కి తల్లిని చేద్దాం అనుకున్నాడట గురూజీ.

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మరిచిపోలేని సినిమా అవుతుంది అనుకున్న “గుంటూరు కారం” మహేష్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ సినిమా చూశాక త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఓ రేంజ్ లో మండిపడ్డారు. అయితే మహేష్ ఎనర్జీ మాత్రం సినిమాను నడిపించిందని టాక్ నడిచింది. ఇదిలా ఉండగా తాజాగా “గుంటూరు కారం” సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఫిల్మీ ఫైకి అందుతున్న సమాచారం ప్రకారం “గుంటూరు కారం” సినిమాలో సీనియర్ నటి ఈశ్వరి రావు పోషించిన పాత్ర కోసం ముందుగా ఒక హాట్ యాంకర్ ని అనుకున్నారట.

త్రివిక్రమ్ ఈ సినిమా కోసం నటీనటులను సెలెక్ట్ చేస్తున్న సమయంలో యాంకర్ అనసూయతో ఈశ్వరి రావు పాత్రను చేయించాలని అనుకున్నారట. కానీ ఆ తర్వాత అనసూయ మరో హీరోయిన్ కి తల్లి పాత్ర అంటే ఒప్పుకుంటుందో లేదో అనే డౌట్ వచ్చి, ఆ రోల్ కోసం ఈశ్వరి రావును సంప్రదించారట. నిజానికి ఈ పాత్రకు ఆమె బెస్ట్ ఛాయిస్ అయ్యింది. మహేష్ బాబు తర్వాత “గుంటూరు కారం” సినిమాలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది ఈశ్వరి రావు అనే చెప్పాలి. ఒకవేళ నిజంగానే అనసూయను ఈ సినిమాలో హీరోయిన్ కి తల్లి పాత్రలో తీసుకోవాలి అనుకున్నా కూడా ఆమె అసలు ఒప్పుకునేది కాదేమో.

- Advertisement -

యాంకర్ గా బుల్లితెరపై సత్తా చాటిన అనసూయ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన “రంగస్థలం” సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్ర ఆమె కెరీర్ ను పూర్తిగా మలుపు తిప్పేసింది. ఇక ఆ తర్వాత అనసూయకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఇప్పటికీ చాలా సినిమాల్లో మెయిన్ లీడ్ గా నటించే అవకాశం వస్తోంది అనసూయకు.

ఒకవైపు పాన్ ఇండియా రేంజ్ లో నటించే అవకాశం దక్కించుకుంటూనే, మరోవైపు ఫిమేల్ లీడ్ రోల్స్ చేస్తూ దూసుకెళ్తోంది అనసూయ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాషల్లోనూ అనసూయకు అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో హీరోయిన్ కు తల్లి పాత్ర చేయడం అంటే కష్టమే మరి. మొత్తానికి ఆమెను ఈ పాత్ర గురించి సంప్రదించకుండా మంచి పనే చేశారు గురూజీ.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు