Krishnamma Movie Collections : రూ.కోటి కూడా రాలేదు.. అప్పుడే రూ.5 కోట్ల పోస్టర్ వచ్చేసింది..!

Krishnamma Movie Collections.. ఒకపక్క సినిమాలు చూడడానికి థియేటర్స్ కి ప్రేక్షకులు రాక కొన్ని రోజులపాటు సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ మూసివేయాలని సినిమా హాల్ యజమానులు నిర్ణయించగా.. మరొకవైపు గతవారం విడుదలైన సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ అప్పుడే బ్రేక్ ఈవెన్ అయింది అంటూ ఆ చిత్ర నిర్వాహకులు చెప్పడం అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. నిజానికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి దృష్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ? ఎక్కడ ఎవరు గెలుస్తారు ?అనే విషయం పైనే.. ఇలాంటి సమయంలో ఎవరూ కూడా సినిమా థియేటర్లకు వెళ్లి సినిమా చూసే అవకాశాలు లేకపోవడంతో కలెక్షన్లు రాలేదని యజమానులందరూ 10 రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలని నిర్ణయించుకున్నారు.. ఇకపోతే ఒకపక్క సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ పరిస్థితే ఇలా వుంటే ఇక మల్టీప్లెక్స్ ల పరిస్థితి మరింత దారుణంగా మారింది.

థియేటర్స్ అన్ని మూసేశారు కానీ రూ.5 కోట్లు బ్రేక్ ఈవెన్..

Krishnamma Movie Collections: Not even a Rs. crore has arrived.. Just then a Rs. 5 crore poster has arrived..
Krishnamma Movie Collections: Not even a Rs. crore has arrived.. Just then a Rs. 5 crore poster has arrived..

ఒకపక్క సినిమా హాలు యజమానులు సంక్రాంతికి విడుదలైన సినిమాలలో హనుమాన్ తర్వాత విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాలు తప్ప.. వేరే ఏ సినిమా కూడా పెద్దగా నడవలేదని చెబుతున్నారు. ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావితం చూపలేదని ట్రేడ్ అనలిస్టులు కూడా స్పష్టం చేశారు.. ఇదిలా ఉండగా మరోవైపు సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ చిత్రం గతవారం విడుదలైంది. ఒకపక్క ఏ సినిమా హాల్ కూడా నడవడం లేదు అని అంటున్న సమయంలో ఈ సినిమా నిర్వహకులు ఇప్పటి వరకు రూ.5.40 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని.. సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయిందని చెబుతున్నారు.. ఇక ఈ సినిమాకి వివి గోపాలకృష్ణ దర్శకుడుగా వ్యవహరించగా.. కొరటాల శివ సమర్పించారు..

కృష్ణమ్మ.. తప్పుడు పోస్టర్లతో ట్రోల్స్ వైరల్..

శుక్రవారం మొదలు ఒక పది రోజులు తెలంగాణలో సుమారు 450 సింగిల్ స్క్రీన్ సినిమా హాల్స్ మూసివేస్తామని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక ప్రేక్షకులు రాకపోవడం సినిమా కలెక్షన్ల కంటే కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో సినిమా హాల్స్ ఇప్పుడు నడవడం కష్టంగా ఉందని కొన్ని రోజులు మూసివేయాలని నిర్ణయించామని సినిమా థియేటర్ ల యజమానులు చెబుతున్నారు ఇటువంటి సమయంలో కృష్ణమ్మ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం ఆసక్తికరంగానూ అందరిలోనూ అనుమానాలను కూడా పెంచేస్తోంది… కేవలం ఆరు రోజుల్లోనే రూ.5.4 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని పోస్టర్ వేయడం నిజంగా ఆశ్చర్యకరం.. మరి వీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఎలా పోస్టర్ వేశారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సినిమా విషయానికి వస్తే పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఇంత కలెక్షన్స్ ఎలా రాబట్టింది కేవలం పోస్టర్స్ వరకే ఈ కలెక్షన్ పరిమితమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ పోస్టర్ తో ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది ఈ సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు