NaaSaamiRanga: వారంలో క్లీన్ హిట్ స్టేటస్.. అయినా నాగ్ హ్యాపీగా లేడా?

టాలీవుడ్ లో గత కొంత కాలంగా సరైన హిట్లు లేకా, టాలీవుడ్ ని ఏలే స్థాయి నుండి, ఇండస్ట్రీ లో తమ ఉనికినే కోల్పోయే స్టేజికి దిగిపోయిన స్టార్ ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ. నాగేశ్వరరావు తర్వాత ఆ లెగసి ని కంటిన్యూ చేస్తూ వచ్చిన స్టార్ హీరో కింగ్ నాగార్జున. ఆ తర్వాత మూడో జెనరేషన్ లో తండ్రి అంత కాకపోయినా హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని మీడియం రేంజ్ హీరోల్లో ఒకడిగా ఎదిగాడు నాగ చైతన్య. ఇక అఖిల్ గురించి ప్రస్తుతం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని ఫ్యామిలీ నుండి కొంత కాలంగా వస్తున్న ఏ సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఒక్క హీరో కూడా బ్లాక్ బస్టర్ కొట్టలేదు. ఇక ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగార్జున హీరోగా పండగ సెంటిమెంటుతో వచ్చిన లేటెస్ట్ సినిమా “నా సామి రంగ”. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. పైగా వారం రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలిచింది. అయినా సరే కింగ్ నాగార్జున హ్యాపీగా లేడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే నా సామిరంగ ఓ మలయాళం సినిమా రీమేక్ గా తెరకెక్కగా, పండగ అడ్వాంటేజ్ తో మాత్రమే రిలీజ్ అయిన ఒక మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ మినహా మరే సినిమా కూడా ఆకట్టుకోకపోవడంతో నా సామి రంగ పండగ ఊపులో హిట్ అయింది. ఇక పండగ తర్వాత థియేటర్లలో చల్లబడింది. అంతే తప్ప ఈ సినిమాలో పెద్ద స్ట్రాంగ్ కంటెంట్ ఏమి లేదని అందరికి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే నాగ్ పాత్ర కంటే అల్లరి నరేష్ పాత్ర బాగా డిజైన్ చేసారని నెటిజన్లు కామెంట్స్ చేసారు. పైగా ఇదేమి నాగ్ కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అవలేదు.

- Advertisement -

అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్ని నాయన తో పండగ బ్లాక్ బస్టర్ కొట్టిన నాగ్ అదే సెంటిమెంట్ ని రిపీట్ చేద్దామని నా సామిరంగ తో వచ్చాడు. కానీ ఇందులో నాగ్ మార్క్ కనిపించలేదు. అందుకే ఫ్యాన్స్ కూడా అంతగా ఇంప్రెస్ అవలేదని తెలుస్తుంది. నిజం చెప్పాలంటే నాగార్జున కి ఒక “మాస్” రేంజ్ లో బ్లాక్ బస్టర్ కాకపోయినా, కనీసం సోగ్గాడే చిన్ని నాయన లా నాగార్జున కే అసలు క్రెడిట్ దక్కేలా ఒక నిఖార్సైన బ్లాక్ బస్టర్ కావాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి అలాంటి బ్లాక్ బస్టర్ ఎప్పుడొస్తుందో తెలీదు గాని, నాగ చైతన్య రాబోయే తండేల్ సినిమా ఆ బ్లాక్ బస్టర్ లోటుని తీరుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు