Captain Miller : దీనికి కూడా పెయిడ్ ప్రీమియర్స్ అవసరమా?

టాలీవుడ్ లో ఈ వారం రిపబ్లిక్ డే స్పెషల్ గా కేవలం డబ్బింగ్ సినిమాలే రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. అది కూడా సంక్రాంతికి తమిళ్ లో రిలీజ్ అయిన కెప్టెన్ మిల్లర్, అయలాన్ సినిమాలు మాత్రమే వస్తున్నాయి. అందులో కెప్టెన్ మిల్లర్ లో ధనుష్ హీరోగా నటించిన సినిమా కాగా, అయలాన్ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించడం జరిగింది. ఈ రెండు సినిమాలు జనవరి 26న రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా ఈ మధ్య టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు రిలీజ్ కి ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడం ట్రెండ్ గా మారింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన “సామజవరగమన” అలాగే ఈ ఇయర్ రిలీజ్ అయిన హనుమాన్ కి ఈ సెంటిమెంట్ బాగా యూస్ అయింది. అయితే ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా కి జనవరి 25న సిటీ లోని కొన్ని ఏరియాల్లో పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇది ప్రమోషనో లేక సెంటిమెంటో తెలీదు గాని, ట్రేడ్ విశ్లేషకులు అవసరమా అని అంటున్నారు.

ఎందుకంటే ఆల్రెడీ సంక్రాంతికి తమిళ్ వెర్షన్ కొన్ని థియేటర్లలో ప్రదర్శించడం జరిగింది. పైగా పొంగల్ కి రిలీజ్ అయింది కాబట్టి, ఈ సినిమా టాక్ ఏంటో ఇప్పటికే చాలా మంది మూవీ లవర్స్ కి తెలిసిపోయింది. అలాంటప్పుడు కెప్టెన్ మిల్లర్ కి పెయిడ్ ప్రీమియర్లు అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఓ డబ్బింగ్ సినిమాకు పెద్దగా హైప్ లేని సినిమాకు పెయిడ్ ప్రీమియర్ల వల్ల ఏ లాభం లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా రిపబ్లిక్ డే రోజు రిలీజ్ అయ్యే ఈ సినిమాలు ఎంత వరకు ఆడియన్స్ ని అలరిస్తాయో చూడాలి.

- Advertisement -

For More Updates :Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు