Siddharth Roy : అర్జున్ రెడ్డిని డిటో దించేశారు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సహా… ఆడియన్స్ చెవిలో పువ్వులు ఏమైనా కనిపిస్తున్నాయా?

తాజాగా విడుదలైన “సిద్ధార్థ్ రాయ్” ట్రైలర్ గతంలో విజయ్ దేవరకొండ నటించిన “అర్జున్ రెడ్డి” సినిమాను గుర్తుకు తెస్తోంది. ట్రైలర్ లో ఉన్న బోల్డ్ సీన్లు, ఎమోషన్స్, డైలాగులు, సన్నివేశాలు చూస్తుంటే “అర్జున్ రెడ్డి” గుర్తుకు రావడం కాదు దాన్నే కాపీ పేస్ట్ చేశారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

“అతడు” సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ “సిద్ధార్థ్ రాయ్” సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తన్వి నేగి హీరోయిన్ గా నటించగా, యశస్వి దర్శకత్వం వహించిన ఈ బోల్డ్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే ఇప్పుడు ట్రైలర్ కంటే ఎక్కువ వాళ్ళు “అర్జున్ రెడ్డి” సినిమాను కాపీ కొట్టారు అనే విషయమే చర్చనీయాంశంగా మారింది. నిజానికి “అర్జున్ రెడ్డి” సినిమా టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్. విజయ్ దేవరకొండ కెరీర్ ను మలుపు తిప్పిన ఈ సినిమాపై వచ్చిన వివాదాలు అన్ని ఇన్ని కావు. కానీ అన్ని వివాదాలను దాటుకుని ఈ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇక అదే జోనర్లో “అర్జున్ రెడ్డి” మూవీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ తాజాగా వచ్చిన “సిద్ధార్థ్ రాయ్” మాత్రం ఇన్స్పిరేషన్ గా కాకుండా డిట్టో దించేసినట్టుగా కనిపిస్తోంది. హీరో లుక్ మొదలుకొని, అతని కోపం, రొమాన్స్, ముఖ్యంగా లిప్ లాక్ సన్నివేశాలు, రోడ్లపై పిచ్చోడిలా తిరగడం, కాలేజ్, లవ్ వంటి సన్నివేశాలన్నీ “అర్జున్ రెడ్డి”లో ఉన్నవే.

కాపీ కంటెంట్ అనే విమర్శలు రావడానికి ఇది సరిపోదు అన్నట్టు “సిద్ధార్థ్ రాయ్” బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా “అర్జున్ రెడ్డి” నుంచి కాపీ కొట్టింది. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే “అర్జున్ రెడ్డి” సినిమాకు సంగీతం అందించిన రధనే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్. అందుకేనేమో ఫ్లోలో “అర్జున్ రెడ్డి” మ్యూజిక్ ను “సిద్ధార్థ్ రాయ్” కి కూడా కాపీ కొట్టేశారు. కనీసం మ్యూజిక్ డైరెక్టర్ ను అయినా మార్చి ఉంటే సినిమాకు కొంత ప్లస్ అయి ఉండేదేమో. కానీ “సిద్ధార్థ్ రాయ్” ట్రైలర్ చూశాక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో సహా సీన్ టు సీన్ కాపీ కొట్టి, కేవలం టైటిల్ మార్చి ఆడియన్స్ చెవిలో పువ్వులు పెడదామనుకుంటున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి కంటెంట్ పై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇక దాదాపు అదే కంటెంట్ తో ట్రైలర్ తోనే ఇలా కాపీ కంటెంట్ అంటూ వివాదం ఎదుర్కొంటున్న “సిద్ధార్థ్ రాయ్” థియేటర్లలోకి వస్తే విమర్శలు ఏ రేంజ్ లో ఉంటాయో మరి. ఇక ఈ మూవీ ఫిబ్రవరిలోనే రిలీజ్ కాబోతోంది. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయలేదు మేకర్స్.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు