Sunny Leone: వరుసగా 15 డిజాస్టర్లు… కానీ పాపులారిటీలో మాత్రం టాప్ ఈ బేబీ డాల్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం అంత ఈజీ ఏం కాదు. అందం, అభినయంతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి అంటూ ఉంటారు సినీ విశ్లేషకులు. ఇక ఇవన్నీ కలిసి వచ్చినప్పటికీ అవకాశాలు రావాలి. అనుకున్న విధంగా అవకాశాలు వస్తే ఆ సినిమాలు హిట్ అవ్వాలి. అప్పుడే ఫేమ్, ఆశించిన స్టార్ డం దక్కుతుంది. లేదంటే బాక్స్ ఆఫీస్ లెక్కలు ఏమాత్రం అటు ఇటు అయినా ఆ నిందను మోయాల్సిన వాళ్లలో హీరోయిన్ కూడా ఒకరు. ఇక వరుసగా రెండు మూడు ప్లాపులు పడ్డాయి అంటే చాలు ఐరన్ లెగ్ ముద్ర వేసి, అవకాశాలు కూడా ఇవ్వరు. అలాంటిది 15 వరుస డిజాస్టర్లు అందుకున్నప్పటికీ సన్నీలియోన్ ఇంకా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుండడం విశేషమే మరి.

గత పది ఏళ్లలో ఏకంగా వరుసగా 15 ప్లాఫ్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది బేబీ డాల్ సన్నీ లియోన్. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మరొక విషయం ఏమిటంటే ఈ ఎఫెక్ట్ ఆమె కెరీర్ పై, సంపాదనపై ఏమాత్రం ప్రభావం చూపించలేదు. నటి పూజ దర్శకత్వం వహించిన “జిస్మ్ 2” మూవీతో 2012లో సినిమా ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది సన్నీ లియోన్. అంతకు ముందు దాకా పలు పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీ, బాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆ ముద్రను చెరిపేసుకోవడానికి బాలీవుడ్లో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

అలా ఆమె నటించిన ఈ మొదటి చిత్రమే మంచి హిట్ కావడంతో మరిన్ని అవకాశాలు సన్నిలియోన్ తలుపు తట్టాయి. ఇక ఆ తరువాత ఈ బ్యూటీ హీరోయిన్ గా కంటే ఐటమ్ సాంగ్స్ తోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. సన్నీనీ ముద్దుగా ఆమె అభిమానులు బేబీ డాల్ అని పిలుచుకుంటారు. 2014లో వచ్చిన “రాగిణి ఎంఎంఎస్ 2” మూవీలో “బేబీ డాల్” అనే పాటలో సన్నిలియోన్ కనిపించగా, ఆ సాంగ్ ఫుల్ గా పాపులర్ అయ్యి సన్నీకి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ పాపులారిటీ కారణంగా ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చినప్పటికీ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.

- Advertisement -

గత పదేళ్లలో సన్నీ 15 చిత్రాలు చేయగా, అవన్నీ ప్లాప్ అవ్వడం గమనార్హం. కానీ విచిత్రంగా ఇప్పటికీ ప్రేక్షకుల్లో సన్నీలియోన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఐటెం సాంగ్ చేస్తుంది అంటే ఆ బజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇదంతా చూస్తుంటే సన్నీ నక్క తోకను తొక్కినట్టుగా అనిపిస్తుంది. అదే వేరే హీరోయిన్ కు ఈ రేంజ్ ప్లాపులు ఉంటే కనీసం ఆమెను ఇండస్ట్రీ చుట్టుపక్కల కూడా కనిపించనిచ్చేవారు కాదు. ఐరన్ లెగ్ అంటూ ఆమడ దూరం పారిపోయేలా చేసేవారు. కానీ సన్నీ టైం బాగుండి ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోగలుగుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కేవలం ఐటమ్ సాంగ్స్ తోనే కోట్లలో సంపాదిస్తోంది. ఇటీవల అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సన్నిలియోన్ నటించిన “కెన్నడి” సినిమా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రీమియర్ కాగా, దానికి హాజరైన ప్రముఖుల నుండి స్టాండింగ్ ఓవేషన్ లభించడం విశేషం.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు