Personality Development: మీరు కాన్ఫిడెంట్ గా లేరనే నిజాన్ని ఈ చిన్న చిన్న విషయాలే బయట పెట్టేస్తాయి.. జాగ్రత్త

మీటింగ్ అయినా, ఇంటర్వ్యూ అయినా లేదంటే మరేదైనా సమావేశం అయినా మీ బాడీ లాంగ్వేజే మీకు మంచి ఫ్రెండ్ కావచ్చు, లేదా అతి పెద్ద శత్రువు కావచ్చు. ఎందుకంటే మీ బాడీ లాంగ్వేజ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా లేరా అనే విషయాన్ని మీలో కనిపించే చిన్న చిన్న విషయాలే బయట పెట్టేస్తాయి. మీకు తెలియకుండానే జరిగే ఈ చిన్న చిన్న తప్పుల వల్ల మీకు కాన్ఫిడెన్స్ లేదన్న విషయం అవతలి వ్యక్తికి అర్థం అయిపోతుంది. మరి ఇంతకీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ను బయట పెట్టేసే ఆ తప్పులు ఏంటి? అంటే…

1. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడం
ఐ కాంటాక్ట్ అనగానే తదేకంగా చూడడం, చూపులతో అవతలి వ్యక్తిని ఇబ్బంది పడేలా చేయడం కాదు. మనోహరమైన, ఆకర్షణీయమైన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వల్ల అవతలి వ్యక్తి ఇట్టే అట్రాక్ట్ అవుతారు. అయితే ఐ కాంటాక్ట్ అనేది కేవలం ఆకర్షణ గురించి మాత్రమే కాదు, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని తెలియజేసే సంకేతం. మీరు అవతలి వ్యక్తిని సరిగ్గా చూడలేకపోతున్నారు అంటే మీకు ఆత్మవిశ్వాసం లేదు అనే విషయాన్ని సూచిస్తుంది. ముఖ్యంగా ఆఫీస్ వ్యవహారాల్లో సరైన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోతే మీరు అసౌకర్యానికి గురవుతున్నారనేదానికి అది సంకేతం అవుతుంది.

2. క్లోజ్డ్ ఆఫ్ సైన్స్
అంటే చేతులు కాళ్ల ద్వారా మీ బాడీ లాంగ్వేజ్ ను బట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ బయటపడుతుంది. ఏదైనా మీటింగ్ టైంలో చేతులు గట్టిగా అడ్డం పెట్టుకుని కూర్చోవడం, లేదంటే కాళ్ళను గట్టిగా లాక్ చేయడం వంటివి చేస్తే వాళ్ళు తమ ఇన్ సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. ఓపెన్, రిలాక్స్డ్ బాడీ లాంగ్వేజ్ ఉంటే ఆ వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడని అర్థం.

- Advertisement -

3. ముఖం లేదా మెడను తరచుగా తాకడం
ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో సగటున కొంతమంది ప్రజలు తమ ముఖాలను గంటకు 23 సార్లు తాకారట. అయితే సైకాలజిస్ట్ ల ప్రకారం దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎవరైనా తమ భావోద్వేగాలను నియంత్రించడానికి, లేదా ఇబ్బందిగా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పుడు ఇలా మెడను రుద్దడం, మొహాన్ని తాకడం వంటి పనులు చేస్తారట. అలాగే ఒత్తిడిలో లేదంటే ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు ఇలా చేస్తారట.

4. కాళ్లు వణకడం
ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు, లేదంటే ఇంటర్వ్యూ వంటివి ఉన్నప్పుడు కాళ్లు వణకడం సాధారణమే. సాధారణంగా బాగా ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు ఇలా అవుతుంది. చెమటలు పట్టడం, ఫుట్ టాపింగ్, కాళ్లు చేతులు వణకడం వంటివి వాళ్లు నెర్వస్ గా ఉన్నారు అనడానికి సైన్. ఇక దీనికి, ఆత్మవిశ్వాసానికి లింక్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ గా లేని వాళ్లలోనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉంటే పాదాలను నేలపై ఉంచి స్ట్రాంగ్ గా కనిపిస్తారు.

5. వీటితో పాటు మీ భుజాలు, ఛాతీ, మీరు కదిలే విధానం, తక్కువగా మాట్లాడడం వంటివి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ గురించి అసలు నిజం ఏమిటో బయట పెట్టేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ శరీరం మీ ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుతుంది. మీ ప్రతి కదలిక మీరు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మీలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూసుకొని, కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలో నేర్చుకోండి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు