Sai Pallavi: త్వరలోనే హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. ఈమెను అభిమానులు ఎక్కువగా లేడీ పపర్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. నాచురల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో, డాన్స్‌తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలలో తక్కువగా కనిపించినప్పటికీ ఈమెను ఆదరించే అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది.

ఇప్పుడు తాజాగా హీరోయిన్ సాయి పల్లవి ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. సాయి పల్లవి చెల్లెలు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి చెల్లెలు పేరు పూజా కన్నన్. ఈమె కూడా ఒక యాక్టర్. కేవలం ఒక్క సినిమాలో మాత్రమే నటించింది. ఇప్పుడు ఏకంగా వివాహం చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసేసరికి ఈ విషయం బయటికి వచ్చినట్లు తెలుస్తోంది.

పూజా కన్నన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా సాయి పల్లవి ఉండగానే తన చెల్లికి పెళ్లి ఏంటి అనే సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి. సాయి పల్లవి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ చెప్పాల్సిన పనిలేదు. మొదటిసారి మలయాళం సినిమా ప్రేమమ్ తో తన సినీ కెరీర్ ని మొదలు పెట్టింది. తెలుగులో మాత్రం ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

- Advertisement -

సాయి పల్లవి కెరియర్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఒక వైపు నటిగానే కాకుండా డాక్టర్ గా కూడా చదువుతూ బిజీగా ఉంటోంది. ఇకపోతే సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ మాత్రం సోషల్ వర్కర్. అయితే తమిళంలో చిత్తరాయి సేవ్వనం సినిమాలో నటించిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈమెకు అవకాశాలు రాలేదు . దీంతో కుటుంబానికే పరిమితం అయిపోయింది. తాజాగా ఇప్పుడు తన ప్రియుడిని పరిచయం చేయడంతో ఇంట్లో వాళ్ళు తన ప్రియుడిని ఒప్పుకున్నట్లుగా తెలియజేసింది. మొత్తానికి ప్రేమించిన వాడిని సాయి పల్లవి చెల్లెలు వివాహం చేసుకోబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయం పైన ఎవరు స్పందిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Pooja Kannan (@poojakannan_97)

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు