Nagarjuna: 64 లో కూడా 46 లా.. నాగ్ ఫిట్నెస్ మంత్ర ఇదే..!

Nagarjuna:  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈయన వయసు 64 సంవత్సరాలు అయినా ఇంకా 46 సంవత్సరాల వయసున్న వ్యక్తిలా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా తన కొడుకు నాగచైతన్య వయసు 40 కి చేరువలో ఉన్నా అదే అందంతో.. కొడుకు యవ్వనంతో పోటీపడుతూ మరింతగా యువతను ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ తెలుసుకోవడానికి అభిమానులు ,సినీ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా నాసామిరంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నాగార్జున ఈ వయసులో కూడా తాను ఇంత యవ్వనంగా ఉండడానికి గల కారణాన్ని రివీల్ చేశారు. తాజాగా నాగార్జునతో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి , గేయ రచయిత చంద్రబోస్ ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే కీరవాణి మాట్లాడుతూ.. నాగార్జున మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఏదైనా డైట్ ఫాలో అవుతున్నారా? అని అడగగా.. తాను ఎలాంటి డౌట్ మైంటైన్ చేయనని తెలిపారు. అంతేకాదు ఎంత తినాలనిపిస్తే అంతా కడుపునిండా తింటానని కాకపోతే తాను రెగ్యులర్గా ఒక పని మాత్రం పక్కాగా చేస్తానని తెలిపారు.

నాగార్జున మాట్లాడుతూ.. ఉదయం లేవగానే తప్పకుండా వర్కౌట్ చేస్తాను. అలా చేయడం వల్ల మనం తిన్న ఫుడ్ అంతా క్యాలరీస్ రూపంలో కరిగిపోయి మంచి ఫిట్ గా ఉంటాము. ఇక ఇదే నేను ఫాలో అవుతాను అంటూ నాగార్జున తెలిపారు. ఇక నాగార్జున చెప్పిన ఫిట్నెస్ సీక్రెట్ గురించి తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నా సామిరంగా సినిమా నిన్న థియేటర్స్ లో విడుదల అయ్యి పాజిటివ్ రెస్పాండ్ తో దూసుకుపోతోంది. ఇక ఇందులో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తోటి హీరోలుగా నటించగా.. ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు