Vijay : విజయ్ కు బంపర్ ఆఫర్.. ఏకంగా 250 కోట్ల రెమ్యునరేషన్‌ ?

Vijay: కోలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కడి పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. అలాంటి హీరోలలో విజయ్ ఒకరు. రజినీకాంత్ తర్వాత హీరో విజయ్ కి అంత క్రేజ్ ఉంది. అలాంటి ఈ సీనియర్ హీరో విజయ్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ చేయనున్నాడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు విజయ్.

వాస్తవానికి హీరో విజయ్ 1994 సంవత్సరంలో బొబ్బిలి రాయుడు సినిమాతో హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ కి తిరుగులేకుండా పోయింది. ఆయన చేసిన ప్రతి సినిమా బంపర్ హిట్ అయింది అన్న సంగతి తెలిసిందే. మన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో… తమిళ ఇండస్ట్రీలో హీరో విజయ్ కి అంతటి క్రేజ్ ఉంది. ఆయన ఫోటో పెట్టుకుని మరీ కొంతమంది పూజలు చేస్తారు.

పొలిటికల్ ఎంట్రీ…

అయితే హీరో విజయ్ సినిమాలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలను, పేదలకు సాయం చేయడం లాంటివి ఎన్నో చేశారు. దీంతో తమిళనాడు రాష్ట్రంలోనే హీరో విజయ్ కి మంచి క్రేజీ వచ్చింది. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకొని రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు హీరో విజయ్. హీరో విజయ్ రాజకీయాలలోకి రావాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కానీ ఆయన లైట్ తీసుకున్నారు. కానీ తాజాగా తన రాజకీయ పార్టీని కూడా ప్రకటించేశారు హీరో విజయ్.

- Advertisement -

తమిళగ వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు హీరో విజయ్ ( Vijay ). తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్డం ఉన్న హీరో విజయ్ కావడంతో… ఆయన సక్సెస్ అవుతారని అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా విజయ్ పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. కానీ అప్పుడు ఆ వార్తలను విజయ్ నేరుగా ఖండించారు. కానీ ఇటీవల ఏకంగా పార్టీని ప్రకటించేశారు విజయ్. త్వరలోనే తన పార్టీ ఎజెండాను కూడా ప్రకటిస్తారు. 2026 సంవత్సరంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హీరో విజయ్ పోటీ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.

సినిమాలకు రిటైర్మెంట్…

ఆ లోపు భారీ బడ్జెట్ సినిమాలు చేసి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నాడు విజయ్. కాగా, 2018 సంవత్సరంలో వచ్చిన సర్కార్ అనే సినిమాతో అందరిని మెప్పించారు విజయ్. ముఖ్యంగా మన తెలుగులో నేరుగా ఈయన చేసిన సినిమా వారసుడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయింది. అంతేకాదు సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే ముందు భారీ బడ్జెట్ సినిమాలు చేయడమే కాకుండా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాడట విజయ్.

ప్రస్తుతం విజయ్ The Goat సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్లు తీసుకుంటున్నాడట విజయ్. ఇక తన చివరి చిత్రం కోసం ఏకంగా 250 కోట్లు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారట విజయ్. విజయ్ తన చివరి సినిమాను హెచ్ వినోద్ తో చేయనున్నాడు. కాగా ఇప్పటివరకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ 250 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ రికార్డును విజయ్ తిరగరాసేందుకు సిద్ధమవుతున్నాడట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు