GOAT : వెంకట్ ప్రభు మ్యూజికల్ ప్లాన్

తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ దర్శకులలో వెంకట ప్రభు ఒకరు. కేవలం ప్లే బ్యాక్ సింగర్ గా, నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని, మంచి గుర్తింపును పొందుకున్నాడు. వెంకట ప్రభు 2007లో రిలీజ్ అయిన “చెన్నై 60028” అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత చేసిన సరోజ, గోవా, మంకంద, బిర్యాని, మనాడు వంటి చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు వెంకట ప్రభు.

వెంకట ప్రభు మొదటి చిత్రం చెన్నై 600028 ఇది చెన్నైలోని సబ్బరన్ ప్రాంతంలోని ఒక గల్లీ క్రికెట్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో అతని సోదరుడు ప్రేమ్ జే తో పాటు 11 మంది కొత్తవారు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయింది. మంచి సూపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.

వెంకట్ ప్రభు తెలుగులో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం కస్టడీ అని చెప్పొచ్చు. నాగచైతన్య నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. కానీ ఒక దర్శకుడుగా మాత్రం వెంకట్ ప్రభు కి మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మంచి హిట్స్ కూడా అయ్యాయి. మానాడు సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శింబు, ఎస్.జె. సూర్య నటించిన ఈ సినిమా చాలామంది తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పటికీ ఫేవరెట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అంత అద్భుతంగా తెరకెక్కించాడు ఆ సినిమాని వెంకట్ ప్రభు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం వెంకట్ ప్రభు విజయ్ తో ది గ్రేటెస్ట్ ఆల్ టైం అనే సినిమాని చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తలపతి విజయ్ రీసెంట్ గా నటించిన లియో సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ఈ సినిమా పైన అద్భుతమైన అంచనాలు ఉన్నాయి. ఇకపోతే వెంకట్ ప్రభు రిపీటెడ్ గా కొంతమంది టెక్నీషియన్ తో వర్క్.

వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఎక్కువ సినిమాలుకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఇప్పుడు విజయ్ తో చేస్తున్న సినిమా కూడా యువన శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ కూడా ఒక సాంగ్ పాడబోతున్నట్లు తెలుస్తుంది. కేవలం విజయ్ మాత్రమే కాకుండా ఇళయరాజా కూడా ఒక సాంగ్ యువన్ సంగీత దర్శకత్వంలో పాడబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఏదేమైనా మంచి మ్యూజికల్ ప్లాన్ ని వెంకట్ ప్రభు ఫిక్స్ చేశాడని చెప్పొచ్చు.

ఇకపోతే తెలుగులో పిట్టగోడ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్ కేవి. అయితే ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో అద్భుతమైన ఘన విజయాన్ని అందుకున్నాడు అనుదీప్. ఆ తర్వాత అనుదీప్ అందరికీ ఒక ఫేవరెట్ పర్సన్ అయిపోయారు. అనుదీప్ ఇంటర్వ్యూస్ చూడటం కూడా చాలా మంది మొదలుపెట్టారు. అనుదీప్ కి ఇష్టమైన డైరెక్టర్ల పేర్లు లిస్టులో వెంకట్ ప్రభు కూడా ఒకరు అని ఇదివరకే చాలాసార్లు చెప్పుకొచ్చాడు.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు