Vijay Deverakonda Marriage :  విజయ్ పెళ్ళికి ముహర్తం ఫిక్స్ ?

Vijay Deverakonda Marriage :  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రం తమ వారసత్వాన్ని అందిపుచ్చుకొని పైకి వస్తారు. ఇంకా కొంతమంది తమ సొంత కాళ్లపై నిలబడి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా మారిపోతారు. అలాంటి వరుసలో విజయ్ దేవరకొండ కూడా ఉంటారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవర కొండ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్సిలో అతి తక్కువ కాలంలోనే పాపులర్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ.

కేవలం అర్జున్ రెడ్డి అనే సినిమాతో మొత్తం ఇండస్ట్రీని తన వైపునకు తిప్పుకున్నాడు విజయ్ దేవరకొండ. వాస్తవానికి విజయ్ దేవరకొండ 2011 సంవత్సరంలో నువ్విలా అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తర్వాత 2012 సంవత్సరంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో సందడి చేశాడు. కానీ 2016 సంవత్సరంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు. అంతేకాదు 2017 సంవత్సరంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో వెనక్కి చూసుకోలేదు విజయ్ దేవరకొండ.

అప్పటినుంచి విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్… ఇండస్ట్రీలో మంచి క్రేజ్… పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చాయి. ఇంకేముంది మహానటి, గీత గోవిందం, టాక్సీవాలా, ఖుషి లాంటి హిట్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృనాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ లోనే ఫ్యామిలీ కథాంశం అని తెలిసిపోతుంది.

- Advertisement -

అంతకుముందు హీరోయిన్ సమంత మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఖుషి సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కష్టపడ్డాడు. సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఊపుతో ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ. ఇలాంటి నేపథ్యంలోనే విజయ్ దేవరకొండకు బంపర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తన పెద్దపెద్ద సినిమాలు చేయాలని విజయ్ దేవరకొండ డిసైడ్ అయ్యాడట.

ఇందులో భాగంగానే ఎక్కువ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాడట విజయ్ దేవరకొండ. ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ వివాహం గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. దసరా వరకు పెళ్లి చేయాలని విజయ్ దేవరకొండ కుటుంబం నిన్ఱయం తీసుకుందట. దింతో రష్మిక తోనే విజయ్ దేవరకొండ పెళ్లి ( Vijay Deverakonda Marriage ) జరుగుతుందని విజయ్ దేవరకొండ ఫాన్స్ అంటున్నారు. మరి ఇదే నిజం అవుతుందో ? లేదో ? చూడాలి.

కాగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందాన గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. గీత గోవిందం సినిమా సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడ్డారని కొంతమంది అంటూ ఉంటారు. అలాగే వెకేషన్ కి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారని ప్రచారం చేస్తుంటారు. అందుకే విజయ్ కూడా రష్మిక అనే పెళ్లి చేసుకుంటాడని ఫ్యాన్స్ భావన.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు