Family Star Trailer : కొత్తగా బ్రేకులు ఇవ్వాల్సిన పని లేదు… దేవుడిని కోరుకుంటున్న విజయ్

Family Star Trailer : గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురాం కాంబినేషన్లో తెరకెక్కుతున్ రెండవ మూవీ “ఫ్యామిలీ స్టార్”. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లను షురూ చేశారు మేకర్స్. అందులో భాగంగానే తాజాగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ టాక్ ఏంటి? అంటే…

ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ టాక్…

తాజాగా రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ (Family Star Trailer) లో రొమాన్స్, కామెడీ వంటి అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించిన విజయ్ దేవరకొండ చెప్పిన కొన్ని డైలాగులు, మృణాల్, విజయ్ మధ్య కెమిస్ట్రీ, కొన్ని కుటుంబ సన్నివేశాలు, గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్లో హైలెట్స్ అని చెప్పొచ్చు. కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగున్నాయి. రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. ఒక మధ్య తరగతికి చెందిన అబ్బాయి తన ఫ్యామిలీ బాధ్యతలను, ఎమోషన్స్ ను, ప్రేమను ఎలా మేనేజ్ చేస్తాడు అనే విషయాన్ని పరశురాం ఈ సినిమా ద్వారా ఎంటర్టైనింగ్ గా చూపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా వెల్లడించారు. ఇక గీత గోవిందం సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అనిపిస్తోంది. హార్ట్ టచింగ్ ఎమోషన్స్, కామెడీ, లవ్ స్టోరీ వంటి అంశాలను కలగలిపి పరుశురాం ఇంట్రెస్టింగ్ గా ఫ్యామిలీ స్టార్ ను రూపొందించినట్టు అనిపిస్తోంది ట్రైలర్ చూస్తుంటే.

ముఖ్యంగా స్వామి నువ్వు కొత్తగా నాకు లైఫ్ లో బ్రేకులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న దాన్ని మాత్రం చెడగొట్టకు, లిఫ్ట్ లు ఉన్నాయని ఎక్కేసి, సిగరెట్లు ఉన్నాయని కాల్చేసి, మందు ఉందని తాగేస్తే హెల్త్…. ఐయామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్, కోపం పోతుంది అంటే నన్ను కొట్టు అంటూ చెప్పిన కొన్ని డైలాగులు బాగున్నాయి.

- Advertisement -

ఈ మూవీ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో భారీ ఖర్చుతో మిడిల్ క్లాస్ కాలనీ సెట్ ను కూడా నిర్మించినట్టు తెలుస్తోంది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఫ్యామిలీ స్టార్ మూవీని తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ మూవీలో అమెరికన్ యాక్ట్రెస్ దివ్యాంశా కౌశిక్, రష్మిక మందన్న కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది.. అలాగే సినిమాలో అభినయ, వాసుకి విజయ్ దేవరకొండ అక్క, వదిన పాత్రలో కనిపించబోతున్నారు. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని దిల్ రాజు భావించారు. కానీ ఆ సమయంలో స్టార్ హీరోల మధ్య పోటీ నెలకొనడం, ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా వేశారు. ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర పోస్ట్ పోన్ కావడంతో ఆ రోజున ఫ్యామిలీ స్టార్ ను థియేటర్లలోకి దించడానికి ప్లాన్ చేశారు దిల్ రాజు. ఇప్పటికే ఈ మూవీలోని మూడు పాటలను రిలీజ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు