Chiranjeevi : చిరంజీవి ఫామ్ హౌస్ ప్రత్యేకతలివే..!

Chiranjeevi : సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామంది స్టార్ సెలబ్రిటీలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫామ్ హౌస్ ను నిర్మించుకుంటున్న విషయం తెలిసిందే.. ఖాళీ సమయాలలో లేదా పండుగల సమయాలలో తమ కుటుంబంతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా ప్రత్యేకంగా ఒక ఫామ్ హౌస్ ను తమకంటూ నిర్మించుకున్న విషయం తెలిసిందే.. ఇటీవలే సంక్రాంతి సందర్భంగా మెగా , అల్లు ఫ్యామిలీలు చిరంజీవి ఫామ్ హౌస్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.. మరి చిరంజీవి ఫామ్ హౌస్ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

చిరు ఫామ్ హౌస్ ప్రత్యేకతలు..

చిరంజీవి (Chiranjeevi) చాలా యేళ్ళ క్రితమే బెంగళూరులోని దేవనహళ్లి సమీపంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అక్కడ ఫామ్ హౌస్ ని కూడా నిర్మించారు.. ఇకపోతే చిరంజీవి ఫామ్ హౌస్ విషయానికి వస్తే.. దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉందని.. అక్కడ చిరు స్నేహితులు కూడా భూమిని కొనుగోలు చేశారని సమాచారం.. అందులో చిరంజీవికి 12 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది.. ఆకుపచ్చ రంగులో కప్పబడినట్లు కనిపిస్తుంది. మధ్యలో ఒక పాత తరహా ఇల్లు కూడా ఉంది.నడక మార్గాలు, చిన్న నీటి చెరువులు కూడా ఉన్నాయి.. అంతేకాదు అక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి.. ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద పెద్ద వివాహాలు కూడా అక్కడ జరిపించవచ్చు.. ఈ ఫామ్ హౌస్ కి చిరంజీవి తరచూ వస్తూ ఉంటారు.. ఒకసారి మెగా ఫ్యామిలీ ఇక్కడ పండుగలు కూడా జరుపుకుంటారు. చిరు తన కూతురు శ్రీజ రెండో పెళ్లిని కూడా ఇదే ప్రకృతి ఫామ్ హౌస్ లో జరిపించారు.

దేవనహళ్లిలో భూములకు రెక్కలు..

ఇకపోతే దేవనహళ్లి లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు అయిన తర్వాత అక్కడ భూముల ధరల విపరీతంగా పెరిగిపోయాయి.. విమానాశ్రయం పక్కనే చిరంజీవికి చెందిన ఈ విలాసవంతమైన ఫామ్హౌస్ ఉంది.. ప్రస్తుతం అక్కడ ఎకరం భూమి 3కోట్ల రూపాయల చొప్పున పలుకుతోంది.. దీంతో ఈ లెక్కన చూసుకుంటే చిరంజీవి ఫామ్ హౌస్ రూ .36 కోట్ల పై మాటే..మొత్తానికి అయితే చిరంజీవి ఫామ్ హౌస్ ప్రత్యేకతలు, దాని విలువ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు..

- Advertisement -

బెంగళూరులో నీటి కొరతపై చిరు స్పందన..

ప్రస్తుతం బెంగళూరులో నీటి సమస్య ఉంది.. నీటి కోసం పోరాటం కూడా మొదలైంది.. ఇలాంటి సమయంలో నీటి సంరక్షణకు చిరంజీవి జాగ్రత్త తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది . తన ఫామ్ హౌస్ లో నీటిని ఎలా పొదుపు చేస్తున్నారో కూడా వివరించారు.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన కన్నడలో ట్వీట్ చేశారు.. ఇక చిరంజీవి ఇచ్చిన సలహాను ప్రజలు మెచ్చుకుంటున్నారు కూడా .. దీనిని అందరూ పాటించాలని.. నీటిని పొదుపుగా వాడుకోవాలని చెబుతున్నారు చిరంజీవి.. మొత్తానికి అయితే చిరంజీవి ఇచ్చిన సలహా కూడా అందరిని ఆలోచింపచేస్తుందని చెప్పవచ్చు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు