Katrina Kaif : ఆ రోజుల్లో ‘కత్రినా’ మల్లీశ్వరి సినిమాకి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Katrina Kaif : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు బాలీవుడ్ లో వరుస సినిమాలతో స్టార్ హీరోల సినిమాల్లో బిజీ అయిన ఈ భామ భారీ హిట్లతో బాలీవుడ్ ని ఏలింది. ఇప్పుడు యంగ్ హీరోయిన్ల రాకతో స్పీడ్ తగ్గించినా, అడపాదడపా బడా సినిమాలు చేస్తూ, స్వింగ్ లో ఉంది. అయితే కత్రినా కైఫ్ కెరీర్ బిగినింగ్ లో తెలుగు సినిమాల్లో నటించిందని తెలిసిందే. ఇక్కడి సినిమాలతోనే ఆమెకు బ్రేక్ రాగా, ఆ తర్వాతే బాలీవుడ్ లో ఆఫర్లు పలకరించాయి. అయితే బాలీవుడ్ లో బూమ్ అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కత్రినా ఫస్ట్ మూవీ తో ప్లాప్ అందుకోగా, రెండో సినిమా మల్లీశ్వరి తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో మీర్జాపురం యువరాణి మల్లీశ్వరి గా కత్రినా కైఫ్ అద్భుతంగా అభినయంతో ఆకట్టుకుందని చెప్పాలి. అయితే ఈ సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ఇటీవల కత్రినా కైఫ్ రెమ్యూనరేషన్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.

మల్లీశ్వరి రెమ్యూనరేషన్ ఇంతే..

ఇక కత్రినా కైఫ్ తెలుగులో చేసిన మల్లీశ్వరి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే అల్లరి పిడుగు సినిమా అంతగా ఆడలేదు. అయితే మల్లీశ్వరీ మూవీలో కత్రినా నటన, డ్యాన్సుల మీద ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఏ ఎక్స్‌ప్రెషన్ సరిగ్గా పెట్టలేదని, డ్యాన్స్ కూడా సరిగ్గా చేయలేకపోయిందని అంటుంటారు. కత్రినా సైతం సాంగ్స్ షూట్ టైంలో డ్యాన్స్ సరిగ్గా రావడం లేదని ఫీల్ అయ్యేదట. ఎలా వస్తే అలా చేయ్, అడ్జస్ట్ చేస్తానంటూ విజయ్ భాస్కర్ చెబుతుండేవాడట. ఆ నాటి మల్లీశ్వరి సంగతుల్ని విజయ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుండగా, మల్లీశ్వరి సినిమాకు హీరోయిన్‌ ను వెతికి బాగానే అలసిపోయారట. చిరవకు ఓ యాడ్‌లో కత్రినాని చూసి ఓకే చేశారట. సురేష్ బాబుకి చెబితే ఎలాగోలా కత్రినా కైఫ్‌ను పట్టుకున్నారట. కానీ ఆమె ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ కూడా సరిగ్గా లేవని అంతా అనుకున్నారట. కానీ ఆ ప్రిన్సెస్ పాత్రకి కత్రినా కరెక్ట్‌గా సెట్ అవుతుందని ముందే ఫిక్స్ అయి ఉన్నాడట విజయ్ భాస్కర్. ఆమె అయితేనే బాగుంటుందని పట్టుబట్టారట. ఆమెకు అప్పట్లోనే డెబ్బై లక్షలు ఇచ్చారని, ఆమె స్టాఫ్, రాకపోకలకు మరో పాతిక లక్షలు అయి ఉంటుందని, అప్పట్లోనే కోటి రూపాయలు అంటే మామూలు విషయం కాదని విజయ్ భాస్కర్ అన్నాడు.

అప్పుడు డాన్స్ రాలేదు.. మరి ఇప్పుడు!

అయితే కత్రినా కైఫ్ (Katrina Kaif) మల్లీశ్వరి సినిమాలో డాన్స్ అంతగా చేయలేదని విజయ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఆమె ఎంతలా ఎదిగిందో అందరికీ తెలిసిందే. నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్, తపన ఉంటే ఏమైనా చేయొచ్చు అని కత్రినా గురించి విజయ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు. షీలా కి జవానీ, చెక్ ని చమేలీ వంటి స్పెషల్ సాంగ్స్ తో బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ ని దక్కించుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా విజయ్ సేతుపతి తో కలిసి మేరీ క్రిస్మస్ సినిమాతో పలకరించిన కత్రినా సోషల్ మీడియా లో కూడా తెగ యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు