Akshay Kumar : ఏడాదిలో 980 కోట్ల వసూళ్ల హీరో.. ఒక్క హిట్టు కోసం సౌత్ సినిమాని నమ్ముకున్నాడు..

Akshay Kumar : సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమాలు వరుస ప్లాపులయ్యే సరికి మార్కెట్ కోల్పోతారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరి ఫామ్ ఎప్పుడు, ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. వరుస పెట్టి హిట్స్ ఇచ్చిన కొందరు హీరోలు, ఆ తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను కూడా సొంతం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ఫేస్ లోనే ఉన్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఈ స్టార్ హీరో రీసెంట్ గా చేసిన సినిమాలు అన్నీ ఫ్లాఫ్ అవుతూ ఉండగా, బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఒక్క హిట్టు కోసం పరితపిస్తున్నాడు. దాదాపు నాలుగేళ్ళ కాలంలో పది ప్లాపులు అందుకున్నాడంటే ఎంత డౌన్ అయ్యాడో తెలుస్తుంది. ఒకప్పుడు ఖాన్ త్రయానికి చుక్కలు చూపించిన ఈ హీరో బాలీవుడ్ లో వరుస పరాజయాలతో యంగ్ హీరోలకి కూడా ఏమాత్రం పోటీనివ్వలేకపోతున్నాడు.

ఒకే ఏడాదిలో 4 హిట్లతో 980 కోట్లు…

అయితే అక్షయ్ కుమార్ ఈ మధ్య కాలంలో వరుస ప్లాపులతో ఎంత డౌన్ అయ్యాడో. కోవిడ్ కి ముందు అంత సూపర్ ఫామ్ లో ఉండే వాడు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 టైంలో ఓ రేంజ్ ఫాంతో రచ్చ చేసిన అక్షయ్ ఆ ఒక్క ఏడాదే 980 కోట్లు కొల్లగొట్టాడు. కేసరి సినిమా 155.7 కోట్లు, మిషిన్ మంగల్ 203.8 కోట్లు, హౌస్ ఫుల్ ఫోర్ 210.25 కోట్లు అందుకోగా, ఇయర్ ఎండ్ లో వచ్చిన గుడ్ న్యూస్ 205.10 కోట్లు కలెక్ట్ చేసింది. మొత్తం మీద ఈ 4 సినిమాల కలెక్షన్స్ 775 కోట్లు అందుకోగా ఇండియాలో గ్రాస్ 840 కోట్ల దాకా ఉంటుంది. ఇక అన్ని సినిమాల ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే 980 కోట్ల రేంజ్ లో ఉండగా ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కోవిడ్ తర్వాత అక్షయ్ కుమార్ సినిమాలు ఒకటి రెండు తప్పితే అన్నీ నిరాశ పరిచాయి. అక్షయ్ కుమార్ నటించిన బెల్ బాటం, సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు, సేల్ఫీ, OMG2 మరియు మిషన్ రాణిగంజ్, లక్ష్మీ, అతరింగి రే, కట్ పుట్లీ మరియు తన లేటెస్ట్ మూవీ బడే మియా చోటే మియా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వగా అందులో సూర్యవంశీ, OMG2 లు మాత్రమే ఆకట్టుకున్నాయి.

హిట్టు కోసం సూర్య సినిమా రీమేక్..

ఇక ఓవరాల్ గా అక్షయ్ కుమార్ కోవిడ్ టైంలో చేసిన సినిమాల్లో 2 సినిమాలు హిట్ అవ్వగా మిగిలిన సినిమాలు అన్నీ ఫ్లాఫ్ అయ్యాయి. ఒకప్పుడు ఒక్క ఏడాదిలో 980 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకున్న హీరో కి ఇప్పుడు ఇలా వరుస ఫ్లాఫ్స్ ఇబ్బంది పెట్టడం బాధాకరం అనే చెప్పాలి. ఇక అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ తో కలిసి చేసిన బడే మియా చోటే మియా కూడా డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు సూర్య హీరోగా చేసిన “ఆకాశం నీ హద్దురా” సినిమా హిందీ రీమేక్ ‘సర్ఫిరా’ మీదే ఆశలు పెట్టుకున్నాడు అక్షయ్. ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన సుధా కొంగర నే ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య రీమేక్ సినెమాలని కూడా జనాలు అంతగా పట్టించుకోవట్లేదు. మరి అక్షయ్ కుమార్ ని సూర్య సినిమా ఎలా కాపాడుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు