Prasanna Vadanam Trailer Talk : లోపం కాన్సెప్ట్ పర్లేదు… కానీ, సుహాస్‌కు వర్కౌట్ అవుతుందా..?

Prasanna Vadanam Trailer Talk : టాలీవుడ్ ఈ ఏడాది వరుస సినిమాలతో దూసుకుపోతున్న చిన్న హీరోల్లో సుహాస్ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, చిన్న పాత్రలు వేస్తూ, ఆ తరువాత ఏకంగా హీరోగా నూ సక్సెస్ అయ్యి తన టాలెంట్ తో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరో సుహాస్. పదేళ్ల కిందటే షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయినా, తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు రావడానికి టైం పట్టింది. ఇక గతేడాది రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో ఇటీవల అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో మరోసారి ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక హీరోగా వరుస సినిమాలతో అలరిస్తున్న సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం “ప్రసన్న వదనం” ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియా లో మిక్సిడ్ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ప్రసన్నవదనం ట్రైలర్ చూసాక ఒక్క మాటలో చెప్పాలంటే హీరోకి ఓ లోపం, ఆ లోపం వల్ల సమస్య, ఆ సమస్య నేపథ్యం లోనే కథా, కథనం.

ఫేస్ బ్లైండ్ నెస్.. దానిపై అల్లిన కథనం..

ప్రసన్నవదనం (Prasanna Vadanam Trailer Talk) సినిమాలో హీరోకి ఫేస్ బ్లైండ్ నెస్. అంటే మొహాల్ని గుర్తించ‌లేడు. ఆఖ‌రికి అద్దంలో త‌న మొహం కూడా చూసుకోలేడు. ర‌క‌ర‌కాల షేపులు క‌నిపిస్తుంటాయి. నిజానికి ఈ పాయింట్ మంచి థ్రిల్లింగ్ గా ఉందని చెప్పాలి. దీంతో హిలేరియ‌స్ కామెడీ సినిమా తీయొచ్చు. కానీ దర్శకుడు ఈ పాయింట్ ప‌ట్టుకొని ఓ క్రైమ్ క‌థ తీశారు. అక్కడే ఏదో కొడుతోంది. ట్రైలర్ లో సూర్య‌గా సుహాస్‌ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ త‌న‌కున్న స‌మ‌స్య చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే త‌న‌కో ప్రేమ‌క‌థ‌, అంతా ఓకే అనుకొంటున్న స‌మ‌యంలో సూర్య మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కొంటాడు. అయితే ఫేస్ బ్లైండ్‌నెస్ ఉన్న హీరో, ఆ మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కోవడం ఏమిటి? అసలు ఆ కేసుల నుండి ఎలా త‌ప్పించుకొన్నాడు? చివరకి అస‌లు హంత‌కుడ్ని పట్టుకుని చ‌ట్టానికి అప్పగించారా లేదా అన్నది కథ నేపథ్యంగా అనిపిస్తుంది. ఇక ట్రైలర్ క్వాలిటీ బాగుండగా, కాన్సెప్ట్ కూడా బాగా రాసుకున్నారు. అర్జున్ వైకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మ‌ణికంఠ‌, ప్ర‌సాద్ రెడ్డి నిర్మించగా, మే 3న థియేటర్లలో విడుద‌ల చేస్తున్నారు.

లోపం ఒకే.. కానీ సుహాస్ కు సూట్ అవుతుందా?

అయితే ప్రసన్నవదనం చిత్రంలో కాన్సెప్ట్ ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ ను బాగానే రాసుకున్నా, కథ మొత్తం ట్రైలర్ లో చెప్పినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. అయితే సుహాస్ కథల ఎంపిక విషయంలో ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ప్రసన్నవదనం లో ఏదో తేడా కొడుతుందేమో అనిపిస్తుంది. అయితే ఈ మధ్య మనిషికి ఏదో ఒక లోపంతో సినిమా కథలను రాసుకుని హిట్టు కొట్టడం మామూలైపోయింది. కొన్నేళ్ల కింద నాని భలే భలే మగాడివోయ్, శర్వానంద్ మహానుభావుడు, రీసెంట్ గా తమిళ్ లో గుడ్ నైట్ మూవీలలో హీరో ఏదో ఒక శారీరక లోపంతో బాధపడుతుంటే దాన్ని ఫన్ & ఎమోషనల్ కథాంశాలతో సినిమాలని రక్తి కట్టించారు మేకర్స్. ఇక స్టార్ హీరోల సినిమాలు చూసినా రామ్ చరణ్ రంగస్థలంలో చెవిటివాడిగా నటిస్తే , రవితేజ రాజా ది గ్రేట్ లో అంధుడిగా నటించాడు. అయితే కొన్ని సినిమాల్లో కథే హీరో అయితే, మరికొన్ని సినిమాల్లో లోపం చుట్టూ అల్లుకుని కథని రాస్తారు కొందరు దర్శకులు. ఇక ప్రసన్నవదనం కాన్సెప్ట్ కూడా అలాగే ఉంది.

- Advertisement -

నిజానికి సుహాస్ కథల ఎంపిక బాగున్నా, ప్రసన్నవదనం కాన్సెప్ట్ విషయంలో ఆడియన్స్ కి సందేహాలు వస్తున్నాయి. ప్రసన్నవదనం సినిమాని కామెడీ డ్రామాతో నడిపిస్తాడని టీజర్ ని చూసి సీరియస్ డ్రామాగా తెరకెక్కించారని తెలుస్తుంది. అయితే ఇలాంటి ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ సుహాస్ కు వర్కౌట్ అవుతుందా లేదా అని చాలా మంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికీ సమాధానం రావాలంటే ప్రసన్నవదనం మూవీ రిలీజ్ దాకా వెయిట్ చేయాలి. ఇక ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా, పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు