Faria Abdullah: నాకు కాబోయే భర్తలో అది లేకపోయినా పర్లేదు..హాట్ కామెంట్స్ వైరల్..!

Faria Abdullah.. జాతి రత్నాలు సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఆ మధ్యకాలంలో అడపాదడపా సినిమాలు చేసింది.. కానీ ఆమె హైటే ఆమె కెరియర్ కు శాపంగా మారిందని చెప్పవచ్చు… అందుకే కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్ లోనైనా మొన్నటి వరకు అవకాశాలు వచ్చాయి.. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఈమె తనకు కాబోయే భర్త పై పలు కామెంట్స్ చేయడం వైరల్ గా మారుతోంది.

Faria Abdullah: It doesn't matter if my future husband doesn't have it..hot comments viral..!
Faria Abdullah: It doesn’t matter if my future husband doesn’t have it..hot comments viral..!

ఎక్కడికెళ్లినా అదే చర్చ..

ఫరియా అబ్దుల్లా హైట్ ఎక్కువ ఇప్పుడున్న చాలామంది హీరోల కంటే ఈమె హైట్ ఎక్కువే.. అందుకే సినిమాలలో హీరో పక్కన ఈమె హైట్ కవర్ చేయడానికి దర్శకులు తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు.. దీంతో ఈమె హైట్ గురించి ప్రతిసారి చర్చ జరుగుతూనే ఉంటుంది.. ఇదిలా ఉండగా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో ఈమె నటించింది.. ఈమె తాజాగా అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ఈ సినిమా మే మూడవ తేదీన రిలీజ్ కానుంది.. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్ లో బిజీగా పాల్గొంటున్నారు.. ప్రమోషన్స్ లో భాగంగానే ఫరియా ఒక ఇంటర్వ్యూలో తనకు కాబోయే భర్త పై ఆసక్తికర కామెంట్స్ చేసింది..

అలాంటి భర్త కావాలంటున్న ఫరియా..

యాంకర్ మీకు ఎలాంటి భర్త కావాలి? మీకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అని అడగ్గా ముఖ్యంగా ఫన్ ఉండాలి ..ఫన్ ఉంటే హైట్ లేకపోయినా పర్లేదు..లైఫ్ లో చాలా బాధలు ఉంటాయి.. వాటన్నింటినీ మర్చిపోవాలి అంటే కాస్త జాయ్ కూడా అవసరం. జోకులు వేయడం, లైఫ్ జోబియల్ గా ఉంచాలి. అలాంటివాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె చెప్పింది.. ఇకపోతే ఫరియా కాబోయే భర్త ఫన్ గా ఉంటే చాలు హైట్ లేకపోయినా పర్లేదు అని చెప్పడంతో.. పొట్టివాడైనా సరే కామెడీ చేసేవాడైతే పెళ్లి చేసుకుంటావా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే తనకు కాబోయే భర్తపై అలాంటి కామెంట్లు చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ

- Advertisement -

ఫరియా అబ్దుల్లా..

ఒకప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ గా పని చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. హైదరాబాద్ అమ్మాయి అయినా ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే పెద్ద హిట్ సొంతం చేసుకుంది . ఇక తర్వాత పలు సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ తో హీరోయిన్గా పలు సినిమాలలో చేస్తూ వస్తోంది.. ఇక ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటిస్తోంది.. మరి ఈ సినిమా ఫరియా కు ఎలాంటి విజయాలను అందిస్తుందో చూడాలి.. కనీసం ఈ సినిమాతో నైనా మళ్ళీ ఆమె వెలుగులోకి రావాలి అని అవకాశాలు అందుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు