Ram Charan : స్టోరీ సెలక్షన్ ఎలా ఉన్నా.. రిజెక్ట్ చేసే విషయంలో చెర్రీ పర్ఫెక్ట్.. ఈ సినిమాలే ఉదాహరణ..!

Ram Charan : టాలీవుడ్ లో మూవీ సెలెక్షన్ల విషయంలో ఒక్కో స్టార్ హీరోది ఒక్కో శైలి. వారి వారి ఇమేజ్ కి తగ్గట్టే సినిమాలు సెలెక్ట్ చేసుకుంటారు. ఒక స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నది ప్రతీ ఒక్కరికీ చాలా ముఖ్యమైనది, కథలు చెప్పడానికి వచ్చిన వాళ్ళు చెప్పిన కథ తమకి సెట్ అవుతుందా, బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుందా లేదా అని అంచనా వేయగల వాళ్ళు కొద్ది మందే ఉంటారు. కొందరు కథ చెప్పేటప్పుడు మెప్పించినా తెరకెక్కించే టైం లో చేతులు ఎత్తేస్తారనుకోండి అది వేరే విషయం. కాని చాలా వరకు కథల విషయంలో ఇప్పుడు జడ్జిమెంట్ బాగున్న స్టార్ హీరోల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు అనే చెప్పాలి. కెరీర్ లో కొన్ని సినిమాలు మాత్రమె అంచనాలను తప్పగా చాలా వరకు సినిమాలు అంచనాలను అందుకున్నాయి. ఇక రామ్ చరణ్ కొత్త కథలు ఎప్పటి కప్పుడు వింటూనే ఉంటారు, కానీ వాటి గురించి బయట ఓకే అయితే తప్పితే పెద్దగా న్యూస్ లు కూడా బయటికి రావు. కానీ గత కొన్నేళ్లలో రామ్ చరణ్ దగ్గరకు వచ్చి చరణ్ నో చెప్పిన ఓ నాలుగు సినిమాల గురించి తెలిస్తే, కథల ఎంపిక విషయంలో, వాటిని రిజెక్ట్ చేసే విషయంలో చరణ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో తెలుస్తుంది.

స్టార్ డైరెక్టర్ల కథలు కూడా రిజెక్ట్..

అయితే రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన వాటిలో ముందుగా చాలా ఏళ్ల కింద వచ్చిన గౌతమ్ మీనన్ సినిమా గురించి చెప్పాలి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా ముందు రామ్ చరణ్ చేయాల్సి ఉండగా, తనకి సూట్ అవ్వదని వదిలేసాడు. ఇక ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో ‘ఓకే బంగారం’ కథ కూడా రామ్ చరణ్ చేయాల్సి ఉండగా, తెలుగు లో వర్కౌట్ అవ్వదని నో చెప్పాడు. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ తో చేయగా, ఓ మోస్తరు హిట్ అయింది అంతే. ఇక ఆ తర్వాత మేర్లపాక గాంధీ చెప్పిన కృష్ణార్జున యుద్ధం కథ కూడా ఫస్ట్ రామ్ చరణ్ కే వెళ్ళగా ఆ కథకి కూడా నో చెప్పాడట. ఆ తర్వాత నాని తో సినిమా చేయగా సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఈ మధ్య కాలంలో సోగ్గాడే చిన్నినాయన ఫేం కళ్యాణ్ కృష్ణ చేసిన ‘నేల టికెట్’ కథ తో రామ్ చరణ్ దగ్గరకి వెళ్ళగా ఆ కథ కూడా తనకి సెట్ కాదని నో చెప్పాడట. ఇలా రామ్ చరణ్ నో చెప్పిన ఈ సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు.

స్ట్రాంగ్ డైరెక్టర్లని లైన్లో పెట్టిన చెర్రీ..

ఇక రామ్ చరణ్ (Ram Charan) స్టోరీ సెలక్షన్స్ ఎలా ఉన్నా, సెట్ కానీ కథలను రిజెక్ట్ చేసే విషయంలో చెర్రీ పర్ఫెక్ట్ అని నెటిజన్లు అంటున్నారు. ఇక చరణ్ రిజెక్ట్ చేసిన కథల విషయం లో రామ్ చరణ్ స్టొరీ సెలెక్షన్స్ చాలా వరకు నిజం అయ్యిందని చెప్పొచ్చు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన తో RC16, ఆ తర్వాత సుకుమార్ తో తన 17వ సినిమాని కూడా తీయబుతున్నాడు. ఇక సుకుమార్ సినిమా అయితే ఏకంగా 5 ఏళ్ళ కింద ఫిక్స్ అయిన కథని సమాచారం. ఇక పాన్ ఇండియా రేంజ్ కథలతో తన సినిమాలతో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న రామ్ చరణ్, ఈ ఇయర్ ఎండ్ లో “గేమ్ చేంజర్” తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు