Tollywood : ఈ ఏడాది నైజాం రికార్డు కొట్టేదెవరు?

Tollywood : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నైజాం ఏరియాకి ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయ్యాక తెలంగాణ ప్రాంతం అంతా కూడా నైజాం ఏరియాగా వస్తుంది. ఈ ప్రాంతంలో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఆ మూవీ సూపర్ హిట్ క్యాటగిరీలోకి వెళ్తుంది. అన్ని ఏరియాల వాళ్ళు హైదరాబాద్ లో ఉండడం వల్ల ఇక్కడ సినిమాల భారీ ప్రీమియర్స్ వేస్తూ ఉంటారు. ఇక చిన్న సినిమాలకు, అలాగే మిడ్ రేంజ్ సినిమాలకు నైజాం నుండే దాదాపు 40 నుండి 50 శాతం వసూళ్లు వస్తుంటాయి. ఇక మన స్టార్ హీరోల సినిమాలకి సంబందించిన నైజాం ఏరియా రైట్స్ కోసం భారీ పోటీ ఉంటుంది. తెలుగు స్టార్ హీరోల సినిమాలకి దాదాపు 30 నుండి 40 శాతం వసూళ్లు నైజాం నుండే వస్తాయి. అందుకే ఆ రోజుల్లోనే చిరంజీవి లాంటి అగ్రహీరోలు రెమ్యూనరేషన్ కాకుండా నైజాం ఏరియాల ప్రాఫిట్ లో షేర్ ని తీసుకునే వారు. ఇక ఆయా స్టార్ హీరోల రేంజ్ ని కూడా నైజాం ఏరియా ఓపెనింగ్స్ డిసైడ్ చేస్తుంది.

నైజాం లో రికార్డ్ ఓపెనింగ్స్ లో టాప్!

ఇక నైజాం ఏరియాలో సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే, దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వసూళ్లు అవుతాయని బయ్యర్లు నైజాం రైట్స్ కోసం పోటీ పడతారు. ఇక ఇప్పటివరకు నైజాం ఏరియాలో ఓపెనింగ్స్ పరంగా పలు స్టార్ హీరోల సినిమాలు ఈ మధ్య కాలంలో రికార్డ్ వసూళ్లు అందించాయి. ఇక నైజాం ఏరియాలో మొదటిరోజు షేర్ పరంగా చూసుకుంటే టాప్ లో ఆర్ఆర్ఆర్ మూవీ నిలిచింది. ఈ సినిమా 23.3 కోట్ల షేర్ నైజాంలో మొదటి రోజు కలెక్ట్ చేసింది. ఇక రెండవ స్థానంలో 22.6 కోట్లతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ ఉండటం విశేషం. ఈ సినిమా ఇంత భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇక మూడో స్థానంలో 13.7 కోట్ల షేర్ తో ఆదిపురుష్ నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం 13.3 కోట్ల షేర్ మొదటి రోజు రాబట్టి నాలుగో స్థానములో నిలిచింది. ఇక టాప్ 5లో 12.2 కోట్ల షేర్ తో సర్కారు వారి పాట సినిమా ఉంది. అయితే ఈ ఏడాది టాలీవుడ్ నుంచి అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలన్నింటి పైన భారీ అంచనాలు ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ఆర్ఆర్ఆర్ మొదటిరోజు నైజాం కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలని ఆసక్తి అందరిలో ఉంది.

నైజాం రికార్డ్ కొట్టేదెవరు..

ఇక ఈ ఏడాది భారీ పాన్ ఇండియా (Tollywood) సినిమాలు రిలీజ్ కాబోతుండగా, ఆ రాబోయే చిత్రాలలో మొదటగా కల్కి 2898 AD రిలీజ్ అవుతోంది. ఈ మూవీ చాలా ఈజీగా నైజాంలో ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కల్కి ఫస్ట్ డే నైజాం షేర్ 25 నుంచి 30 కోట్ల మధ్యలో ఉండొచ్చని భావిస్తున్నారు. తర్వాత ఐకాన్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమా కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఈ ఏడాది భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రాబోతున్నాయి. ఇవి కూడా నైజాంలో మొదటి రోజు భారీ వసూళ్లు సాధించే సత్తా ఉన్న సినిమాలే. అయితే వీటిలో ఏ మూవీ RRR కలెక్షన్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. అయితే రీసెంట్ గా వచ్చిన బడా సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయంటే టికెట్ రేట్లు భారీగా పెట్టడం వల్ల కూడా అనుకోవచ్చు. కానీ వాటిని మించి ఇంకా ఇప్పుడు టికెట్ రేట్లు గనుక పెంచితే, ఓపెనింగ్స్ రావొచ్చేమో గాని, లాంగ్ రన్ కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి మేకర్స్ ఇది గుర్తుంచుకోవాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు