Sonali Bendre : అది చేయకుంటే ఇండస్ట్రీ వదిలేసేదాన్ని – సోనాలి బింద్రే

Sonali Bendre : ఒకప్పుడు తెలుగులో మురారి, శంకర్ దాదా ఎంబిబిఎస్, మన్మధుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా బిజీ అయిన సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ రోజుల్లోనే ఈ పేరే ఒక ట్రెండ్. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఇటు సౌత్ లో కూడా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది సోనాలి బింద్రే. ఇక 20స్ వరకు సూపర్ ఫామ్ లో ఉన్న ఈ హీరోయిన్ ఆ తర్వాత సినిమాల్లో స్పీడు తగ్గించింది. తెలుగులో శంకర్ దాదా తో హిట్టు కొట్టాక, పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ మధ్యలో క్యాన్సర్ ని కూడా జయించి అందరి మెప్పు పొందింది. ఇక సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాలి బింద్రే, ఇప్పుడు మళ్ళీ సినిమాలకు సాయి అంటుంది. ఈ అమ్మడు అయిదు పదుల వయసుకు దగ్గరయినా నటనను వదల్లేదు. చాలా ఏళ్ళ తర్వాత తాజాగా ఈమె ‘ది బ్రోకెన్ న్యూస్‌’ అనే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.

ఇండస్ట్రీ వదిలేసేదాన్ని..

అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సోనాలి బింద్రే మే 3న స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ది బ్రోకెన్ న్యూస్ వెబ్‌ సిరీస్ ప్రమోషన్‌ లో పాల్గొన్నారు. ఆ సమయంలో మీడియా తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. తన కెరీర్ ఆరంభంలో తాను డాన్స్ విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లుగా సోనాలి బింద్రే చెప్పుకొచ్చింది. కెరీర్ బిగినింగ్ అప్పుడు తాను చిన్నప్పటి నుంచి నేను డాన్స్ లో పెద్దగా శిక్షణ తీసుకోలేదని చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో డాన్స్ రాకుంటే హీరోయిన్ గా పనికి రారు అన్నట్లుగా భావించే వారు. అలాంటి సమయంలో కెరీర్ స్టార్టింగ్ లో తాను అరవింద స్వామి, మనీషా కోయిరాలా జంటగా నటించిన ‘బొంబాయి’ సినిమాలో ఒక పాటలో నటించే అవకాశం దక్కించుకున్నాను. మణిరత్నం గారు అప్పటికే అయిదు సినిమాలు చేసిన తనని ఎంపిక చేయడం జరిగిందని, ఆ పాటకు డాన్స్‌ బాగా చేయకుంటే తాను ఇండస్ట్రీ వదిలి వేయాలి అనుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ప్రభుదేవ గారు ఆ పాటకు కొరియోగ్రఫర్ అవ్వడంతో మరింత ఛాలెంజింగ్‌ గా తీసుకుని ప్రాక్టీస్ చేస్తూ డాన్స్ చేశానంది. ఇక ఆ పాటలోని ఎక్కువ షాట్స్ సింగిల్‌ టేక్ కి ఓకే అవ్వడం విశేషం.

స్పెషల్ మూమెంట్ మర్చిపోలేను..

అయితే బొంబాయి మూవీ లో ఆ పాట చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత ప్రభుదేవా తండ్రి కొరియోగ్రఫర్‌ సుందరం మాస్టర్‌ తనకు రూ.100 ఇచ్చి అభినందించారని, ఆ మూమెంట్‌ ని తాను ఎప్పుడూ మరచిపోలేను అంటూ సోనాలి బింద్రే గత అనుభవాలను నెమరవేసుకుంది. ఇక సోనాలి బింద్రే (Sonali Bendre) ఆ మధ్య పలు టివి షోలలో కూడా జడ్జి గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలకరించడానికి వస్తుండగా, త్వరలో హిందీ సినిమాలో కూడా నటిస్తుంది. ఇక సౌత్ లో కూడా ఈ అమ్మడు నటించడానికి రెడీ గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో సోనాలి బింద్రే సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు