Karthi : మెసేజ్ ఓరియెంటెడ్ గా సర్దార్2.. స్టోరీ లైన్ లీక్..

Karthi : ఈ మధ్య టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో కూడా సీక్వెల్స్ జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రమే కాకుండా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా సీక్వెల్స్ తీస్తున్నారు. ఇక ఈ మధ్యనే మలయాళంలో ప్రేమలు సినిమా సీక్వెల్ అనౌన్స్ మెంట్ జరగగా, తెలుగులో మ్యాడ్2, టిల్లు క్యూబ్ సినిమాల అనౌన్స్ మెంట్ జరిగింది. తాజాగా కోలీవుడ్ లో కూడా ఓ బ్లాక్ బస్టర్ సినిమా కి సీక్వెల్ రెడీ అవుతుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా సర్ధార్ సినిమా యొక్క సీక్వెల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన రా ఏజెంట్‌ మూవీ ‘సర్దార్‌’ తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా రెస్పాన్స్ రాబట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పైగా సర్దార్‌ లో కార్తీ నటనకు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మొత్తానికి సర్దార్‌ విడుదలయిన సమయంలోనే సీక్వెల్‌ కి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

సీక్వెల్ రెడీ అవుతుంది..

ఇక సర్దార్ 2 సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయి వంద కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా సీక్వెల్ వస్తుందని అప్పుడే అనౌన్స్ అయినా, ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఈ గ్యాప్ లో కార్తీ మూడు సినిమాలు చేసేసాడు. ప్రస్తుతం కార్తీ (Karthi) చేతిలో రెండు కొత్త ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సినిమాలు పూర్తి కాగానే సర్దార్ 2 మొదలవుతుందిట. ఇక ఇటీవలే సర్దార్‌ 2 ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభం అయ్యిందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సీక్వెల్‌ గురించి ఆసక్తికర ప్రచారం జరగుతోంది. సినిమా కథ గురించి, నేపథ్యం గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

మెసేజ్ ఓరియెంటెడ్ గా..

ఇక కార్తీ హీరోగా తెరకెక్కిన సర్దార్ ఫస్ట్ పార్ట్ లో నీళ్ల గురించి, అలాగే దేశం గురించి మంచి పాయింట్స్ చూపించిన మేకర్స్, సర్దార్ 2 నేపథ్యం గురించి కూడా హింట్ ఇచ్చారు. ఇక తాజాగా వస్తున్న వార్తల ప్రకారం సర్దార్ 2 మూవీ డ్రగ్స్ మరియు మహిళల అక్రమ రవాణ అంశాలతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం యువతకు ఈ సినిమా ద్వారా మంచి సందేశం ను ఇవ్వబోతున్నారట. ముఖ్యంగా డ్రగ్స్ కు అలవాటు పడటం వల్ల, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తి వంటి స్టార్‌ హీరో సినిమాలో ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా యువతలో కొంతలో కొంత అయినా మార్పు వస్తే మంచిదే కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం కార్తీ ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు పూర్తి కాగానే సర్దార్ 2 మొదలవుతుంది. ఇక సర్దార్ 2 ని ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించనున్నారట.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు