Naga Chaitanya : వరుస ప్లాపుల్లో ఉన్నా.. రెమ్యూనరేషన్ లో ‘చై’ మాస్..

Naga Chaitanya : టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల్లో ఒకరైన నాగ చైతన్య ప్రస్తుతం పక్కా హిట్టు కొట్టాలనే కసిమీదున్నాడు. ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోలలో టాప్ ప్లేస్ లో ఉండి మంచి మార్కెట్ ఏర్పరచుకున్నాడు చై. రెండేళ్ల వరకు కూడా మజిలీ, వెంకిమామ, లవ్ స్టొరీ, బంగార్రాజు వంటి సినిమాలతో వరుస సూపర్ హిట్లను సొంతం చేసుకున్న నాగ చైతన్య, ఆ తర్వాత థ్యాంక్ యు మరియు కస్టడీ సినిమాలతో దారుణమైన డిజాస్టర్లను అందుకున్నాడు. ఇక ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా నిరాశ పరిచగా, నాగ చైతన్య మార్కెట్ పై కొంతమంది కి లేనిపోనీ అనుమానాలు వచ్చాయి. ఇక ఆ మధ్య హిందీలో చేసిన లాల్ సింగ్ చడ్డా కూడా డిజాస్టర్ కాగా, నటుడిగా చై కి మంచి పేరునైతే తెచ్చింది కానీ రిజల్ట్ ఫెయిల్యూరే. ఇక చివరగా కస్టడీ సినిమా కోసం నాగ చైతన్య బాగా కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా ప్లాప్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే వరుస ఫ్లాఫ్స్ పడ్డా కూడా నాగ చైతన్య మార్కెట్ ఏమి డౌన్ అవ్వలేదని చెప్పాలి.

ప్లాపుల్లో ఉన్నా చై సినిమాలకి సాలిడ్ డిమాండ్..

అయితే రీసెంట్ గా నాగ చైతన్య సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా, ఫ్లాప్ మూవీస్ కి కూడా మంచి నాన్ థియేట్రికల్ బిజినెస్ లు జరిగాయి. అలాగే తన అప్ కమింగ్ మూవీస్ కూడా ప్రామిసింగ్ గా ఉండగా, ముందుగా ‘తండెల్’ సినిమాతో ఈ ఇయర్ ఎండ్ లో సందడి చేయబోతున్నాడు నాగ చైతన్య. ఇక వరుస ఫ్లాఫ్స్ లో కూడా నాగ చైతన్య సినిమాలకు థియేటర్ వద్ద కూడా మంచి బిజినెస్ జరుగుతుంది. ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నాగ చైతన్య నుండి సరైన కంటెంట్ పడితే మంచి హిట్ అవుతాయి. ఇక నాగ చైతన్య కూడా తన రెమ్యూనరేషన్ పై కూడా మంచి డిమాండ్ మీదే ఉన్నాడని తెలుస్తుంది. తన సినిమాలకు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు బాగా జరుగుతూ ఉండటం వల్ల రెమ్యునరేషన్ విషయంలో ఇప్పటికీ స్ట్రాంగ్ గా ఉన్నాడట నాగ చైతన్య.

రెమ్యూనరేషన్ పరంగా తగ్గేదేలేదంటున్న చై..

ఇక నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఒక్కో దానికి 8 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నాగ చైతన్య అప్ కమింగ్ మూవీస్ కి 10 కోట్ల రేంజ్ దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రాబోయే తండేల్ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ను కనుక సొంతం చేసుకుంటే తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ఈ సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు నాగ చైతన్య. ఇక ఈ సినిమాలో లవ్ స్టోరీ పెయిర్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, ఈ కాంబో పై మంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇక చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా నుండి ఓ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక తండేల్ తో నాగ చైతన్య మాస్ కం బ్యాక్ ఇస్తాడని చై ఫ్యాన్స్ అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు