Anudeep: ‘దొంగోడి’గా రవన్న.. కానీ ఈసారి కామెడీ దొంగేనట..

Anudeep : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఇప్పుడు తనకు ఓ సాలిడ్ కం బ్యాక్ హిట్టు పడాలి. ఇక సక్సెస్ రేటుతో సంబంధం లేకుండా రవితేజ సినిమాలు చేస్తాడని తెలిసిందే. అందుకే ఎంటర్టైన్మెంట్స్ స్పెషలిస్ట్ అయిన అనుదీప్ తో చేయికలిపాడు. జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలతో అనుదీప్ ప్రత్యేకమైన కామెడీ డైరెక్టర్ అనిపించుకున్నాడు అనుదీప్. ఇండస్ట్రీ లో అనుదీప్ ఏ ఈవెంట్ కి వెళ్లిన సాలిడ్ రెస్పాన్స్ వస్తుందంటే ఊహించుకోవచ్చు. అనుదీప్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో. అలాంటిది ఎంటర్టైన్మెంట్స్ కి కేరాఫ్ అయిన మాస్ మహారాజ్ తో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు కదా. ఇక వీరి కాంబోలో ఎప్పుడైతే మూవీ అనౌన్స్ అయిందో అప్పటినుండి మినిమం గ్యారెంటీ ఈ సినిమా అని ఆడియన్స్ సైతం ఫిక్స్ అయిపోయారు. ఇదిలా ఉండగా రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా చేస్తూనే అనుదీప్ సినిమా మొదలు పెడదామని చూస్తున్నారట.

క్రేజి టైటిల్ ని ఫిక్స్ చేసిన అనుదీప్…

ఇక రవితేజ ధమాకా తర్వాత గత ఈఏడాది కాలంగా వరుస ప్లాపులను ఎదుర్కొంటున్నాడు. వరుసగా రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాలన్నీ డిజాస్టర్లయ్యాయి. అయినా సరే రవితేజ సినిమాలకి డిమాండ్ తగ్గట్లేదంటే, ఆడియన్స్ లో రవన్న స్థానం అలాంటిది మరి. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్న రవితేజ, ఆ సినిమా పూర్తయిన వెంటనే అనుదీప్ సినిమా వెంటనే స్టార్ట్ చేయనున్నారు. గత ఏడాది నుంచి ఈ కాంబినేషన్ పై అనేక రకాల వార్తలు రాగా, ఈ మధ్యే ఫిక్స్ అయింది. నిజానికి ఈ కాంబోలో ఎప్పుడో సినిమా రావాల్సి ఉండగా, కథ విషయంలో రవితేజ కాంప్రమైజ్ కాకపోవడంతో దర్శకుడు ఇంకాస్త ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా రవితేజ అనుదీప్ సినిమాకి ఓ క్రేజీ టైటిల్ ని ఫిక్స్ చేసారట. ఈ సినిమాలో రవన్న ఒక దొంగగా కనిపించబోతున్నాడట. అందుకే ఈ సినిమాకు ‘దొంగ పోలీస్’ అనే క్యాచీ టైటిల్ అనుకుంటున్నట్టు టాక్ నడుస్తుంది.

‘దొంగుడు’ గా మాస్ రాజా.. వెన్నతో పెట్టిన విద్య..

ఇక రవితేజ దొంగ గా ఇప్పటికే చాలా సినిమాల్లో నటించాడన్న సంగతి తెలిసిందే. దొంగోడు, విక్రమార్కుడు లాంటి సినిమాలతో అతను బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత కిక్ వంటి సినిమాల్లో కూడా అతను చేసిన పాత్రలు అలాంటివే. ఇక రీసెంట్ గా కొన్ని సినిమాల్లో దొంగ గా కనిపించినా అవి ప్లాప్ అయ్యాయి. అయితే అవి సీరియస్ డ్రామాలు. కానీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో రవితేజ దొంగ గా వచ్చిన దొంగోడు, విక్రమార్కుడు, కిక్ వంటి సినిమాలు మంచి హిట్టయ్యాయి. ఇక ఇప్పుడు అనుదీప్ దర్శకత్వంలో కూడా దొంగ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. మరి ఈసారి రవితేజ దొంగ క్యారెక్టర్ తో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఇక దొంగ పోలీస్ టైటిల్ తో అప్పట్లో మోహన్ బాబు ఓ సినిమా కూడా చేసిన సంగతి తెలిసిందే.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు