Best Si-Fi Movies on OTT : ఉత్కంఠ భరితంగా సాగే బెస్ట్ తెలుగు సైన్స్ ఫిక్షన్ మూవీస్ లిస్ట్… ఒక్కసారి చూస్తే వదిలిపెట్టరు 

Best Si-Fi Movies on OTT : ఎలాంటి సినిమా వచ్చినా వదిలి పెట్టకుండా చూసే సినిమా పిచ్చోళ్ళు కొంత మంది ఉంటారు. కానీ మరికొంత మంది మాత్రం జానర్ ను బట్టి సినిమాను ఇష్టపడతారు. అలా సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమాలకు కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. సినిమాను చూస్తున్నంత సేపు మనల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లే సై-పై సినిమాలు అంటే పిచ్చిపిచ్చిగా ఇష్టపడుతూ ఉంటారు. ఇండియన్ సినిమాలు ఇంకా ఆ రేంజ్ కు చేరుకోకపోయినా హాలీవుడ్ నుంచి వచ్చే సైన్స్ ఫిక్షన్ సినిమాలు మాత్రం అదిరిపోయేలా ఉంటాయి. అయితే సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన కొన్ని తెలుగు సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. మరి అవేంటో ఏ ఓటిటిలో ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం.

1. 2.0

బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ అనగానే ముందుగా గుర్తొచ్చేది రోబో. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ నిజంగానే థియేటర్లలో ఆడియన్స్ను వేరే లోకంలోకి తీసుకెళ్లింది. దానికి సీక్వెల్ గా వచ్చిందే 2.0. ఇందులో అక్షయ్ కుమార్ విలన్ గా నటించాడు. రజినీకాంత్ హీరోగా కంటిన్యూ అయ్యాడు. మొబైల్ టవర్ల వల్ల మృత్యువాత పడుతున్న పక్షులను కాపాడడానికి ఓ పక్షి ప్రేమికుడు చేసే పోరాటమే ఈ మూవీ. విజువల్ వండర్ గా ఉండే ఈ మూవీని జియో సినిమాలో చూడొచ్చు. అలాగే దీనితో పాటే రోబో మూవీపై కూడా ఓ లుక్కేయండి.

2. అంతరిక్షం 9000 kmph

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ స్పేస్ అడ్వెంచరస్ మూవీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

- Advertisement -

3. ఒకే ఒక జీవితం

శర్వానంద్, ప్రియదర్శి, అమల అక్కినేని, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ఒకే ఒక జీవితం మూవీకి థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ ఏ వచ్చింది. ఈ మూవీని ప్రస్తుతం సోనీ లివ్ లో చూసే అవకాశం ఉంది.

4. యశోద

రీసెంట్ గా వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ యశోద. సమంత లీడ్ రోల్ లో నటించిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ సరోగసి చుట్టూ తిరుగుతుంది. అందం తగ్గకుండా ఉండడం కోసం కొంత మంది అమ్మాయిలకు గర్భం వచ్చేలా చేసి వాళ్ళ పిండాలపై రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భరించలేని బాధతో అక్కడే బందీగా ఉన్న వాళ్లను యశోద ఎలా రక్షించింది అనేదే స్టోరీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఇక ఓటీటీలో వీటితో పాటే సైన్స్ ఫిక్షన్ హాలీవుడ్ సినిమాలకు కోదవే లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెట్ ఫ్లిక్స్ లో ది మ్యాట్రిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవతార్, ప్రైమ్ వీడియోలో ది టర్మినేటర్ వంటి సినిమాలను చూడొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు