Zara Hatke Zara Bachke OTT Date : రిలీజైన 11 నెలలకు ఓటిటిలోకి… ఎక్కడ, ఎప్పుడు చూడొచ్చు అంటే?

Zara Hatke Zara Bachke OTT Date : బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ జంటగా నటించిన జర హట్కే జర బచ్కే మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన 11 నెలల తర్వాత ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. రొమాంటిక్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ 2023 జూన్ లో థియేటర్లలోకి వచ్చింది. 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ కు వచ్చినప్పటికీ కమర్షియల్ గా అదరగొట్టింది. తాజాగా ఈ మూవీ ఓడిటీలోకి రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

జియో సినిమాలో…

జర హట్కే జర బచ్కే మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ నిరీక్షణకు త్వరలోనే తెరదించబోతున్నారు. మే నెలలో ఈ మూవీ జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జియో సినిమా ఓటిటిలో ఐపీఎల్ ఫీవర్ ఉండడంతో ఈ మూవీని కూడా స్ట్రీమింగ్ చేస్తే మరింత వ్యూయర్షిప్ పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

వాళ్లకు మాత్రమే ఈ సినిమా…

ఇక ఈ సినిమాను జియో సినిమా అందరికీ అందుబాటులో ఉంచే అవకాశం మాత్రం లేదని తెలుస్తోంది. జర హట్కే జర బచ్కే చిత్రాన్ని ప్రీమియం సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంచబోతున్నారని టాక్ నడుస్తోంది. రీసెంట్ గా జియో సినిమా రూ. 29, రూ. 89 రూపాయలతో నెలవారి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్లను రిలీజ్ చేసింది. ఈ ప్లాన్ తీసుకున్న వారికే యాడ్స్ లేకుండా మూవీస్ ను చూసే అవకాశాన్ని కల్పిస్తోంది జియో సినిమా.

- Advertisement -

యాడ్స్ ఫ్రీ ప్లాన్..

ప్రస్తుతం జియో సినిమాలో కంటెంట్ అంతా ఫ్రీగానే ఉంది. కానీ యాడ్స్ గోల మాత్రం ఎక్కువగా ఉంది. ఇప్పుడు నడుస్తున్న ఐపీఎల్ 2024ను కూడా ఫ్రీగానే లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది జియో సినిమా. ఈ నేపథ్యంలోనే ఆ యాడ్స్ నుంచి ఉపశమనం పొందాలి అనుకునే వారి కోసమే ఈ కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను తెరపైకి తీసుకొచ్చారు. దీనివల్ల యాడ్స్ లేకుండా ఇష్టమైన సినిమాలను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడవచ్చు.

40 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్

ఇక జర హట్కే జర బచ్కే సినిమాలో విక్కీ కౌశల్, సారా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించగా ఇనమూల్ హక్, సుస్మిత ముఖర్జీ, నీరజ సూద్ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాను మెడాక్ ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతి దేశ్ పాండే, దినేష్ విజన్ సంయుక్తంగా నిర్మించారు. 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 115 కోట్లను రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు