Shruthi Haasan Break up : శాంతనుతో శృతి బ్రేకప్… అందుకేనా ఇన్ని హింట్లు?

Shruthi Haasan Break up : గత ఏడాది సలార్ బ్లాక్ బస్టర్ హిట్ తో పాన్ ఇండియన్ హీరోయిన్ గా మారిన స్టార్ హీరోయిన్ శృతి హాసన్. ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా ఉంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హాజారికాతో రిలేషన్షిప్ కు బ్రేక్ వేసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీనంతటికీ కారణం ఆమె ఇస్తున్న హింట్స్. మరి ఇంతకీ శాంతను హజారికా, శృతి హాసన్ మధ్య ఏం జరుగుతోంది? అనే విషయంలోకి వెళ్తే…

ఒకరినొకరు అన్ ఫాలో..

శృతి హాసన్ చాలా రోజులుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ కలిసి చేసే సందడి అంతా ఇంతా కాదు. వీళ్ళ రిలేషన్షిప్ చూస్తే కపుల్స్ కి కూడా అసూయ కలుగుతుంది అన్నట్టుగా ఉండేవారు. కానీ సడన్ గా వీళ్ళిద్దరూ తమ రిలేషన్షిప్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది. శృతి హాసన్ ఇంస్టాగ్రామ్ లో శాంతను హాజరికను అన్ ఫాలో చేసింది. ఇక అతను కూడా శృతిని అన్ ఫాలో చేయడంతో వీళ్లిద్దరూ విడిపోయారనే వార్తలకు ఊతం దొరికింది. శృతిహాసన్ అయితే ఏకంగా శాంతనుతో దిగిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది.

ఈవెంట్ లో హింట్…

ముంబై వర్గాల సమాచారం ప్రకారం వీరిద్దరూ విడిపోయి ఇప్పటికే నెల రోజులు పూర్తయిందట. ఇప్పటిదాకా ఒకే కొంపటిలో సహజీవనం చేస్తూ వచ్చిన శృతి, శాంతను బ్రేకప్ జరిగిన నేపథ్యంలోనే విడివిడిగా వేర్వేరు ప్లాట్లలో ఉంటున్నారని టాక్ నడుస్తోంది. హీరామండి ప్రీమియర్ షోకు ఆమె ఒంటరిగా రావడంతో బాలీవుడ్ మీడియా శృతి హాసన్ రిలేషన్షిప్ స్టేటస్ పై సపరేట్ గా ఫోకస్ చేసింది. నిజానికి ఏ సినిమా ఈవెంట్ జరిగినా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికతోనే హాజరయ్యేది. కానీ ఈసారి మాత్రం అలా జరగకపోవడంతో వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అనే వార్త నిజమే అంటోంది బి టౌన్.

- Advertisement -

ఇది రెండవ బ్రేకప్…

ఇండస్ట్రీలో శృతి హాసన్ రిలేషన్షిప్ లో ఉందంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు ఇప్పటిదాకా వినిపించాయి. కానీ అందులో ఆమె అఫీషియల్ గా చెప్పింది మాత్రం ఇద్దరి పేర్లు. ప్రస్తుతం బ్రేకప్ జరిగిన శాంతను హజారికా ఒకరు కాగా, మరొకరు మైకేల్. అతని కంటే ముందే శృతి హాసన్ ఇటాలియన్ యాక్టర్ మైకేల్ కోర్స్ లేతో ప్రేమాయణం నడిపించింది. వాళ్ళిద్దరికీ బ్రేకప్ జరిగాకే శాంతను హజారికతో కొత్తగా లవ్ స్టోరీ స్టార్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఇది కూడా ఎండ్ అయినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం శృతి హాసన్ అడవి శేషుతో కలిసి డెకాయిట్, కన్నడ స్టార్ యష్ తో టాక్సిక్, సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే ఈ సినిమాల్లో డెకాయిట్ లో మాత్రమే నటిస్తోంది అనే అఫిషియల్ గా ప్రకటన వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు